Kitchen Care: చీమల బెడద ఎక్కువైతే.. ఇదిగో ఈ సారి ఇలా చేసి చూడండి

Kitchen Care
x

Kitchen Care: చీమల బెడద ఎక్కువైతే.. ఇదిగో ఈ సారి ఇలా చేసి చూడండి

Highlights

Kitchen Care: చీమలు ఎక్కువగా శుభ్రంగా లేని ప్రాంతాలు, నిత్యం మూసి ఉంచే ప్రాంతాల్లోనే పడుతుంటాయి. ముఖ్యంగా వంటగది, బట్టలు ఉండే ప్రాంతాల్లో ఉంటాయి.

Kitchen Care: చాలామందికి ఇళ్లలో చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో చీమలమందు చల్లేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉంటే ఇది ఎంతో హానికరం. అయితే కొన్ని చిట్కాలు, జాగ్రత్తల ద్వారా చీమల బెడదను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చీమలు ఎక్కువగా శుభ్రంగా లేని ప్రాంతాలు, నిత్యం మూసి ఉంచే ప్రాంతాల్లోనే పడుతుంటాయి. ముఖ్యంగా వంటగది, బట్టలు ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. ముందు మనం వంటగది విషయానికొస్తే..

వంటగదిలో సింక్, సరుకులు ఉండే చోట చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సరుకులు సర్ధిన డబ్బాలు, సీసాలకు మూతలు గట్టిగా పెట్టాలి. అదేవిధంగా వాటిని తరచూ ఒక చోట నుంచి మరొక చోటకు మార్చాలి. పంచదార డబ్బాను చీమలు ఎక్కువగా పడుతుంటే ఒక డబ్బాలో ఇంకొక డబ్బాను పెట్టాలి.

వంటగదిలో గిన్నెలు కడిగే సింక్ చుట్టుపక్కల చీమలు ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. సింక్‌లోపల నుంచి చీమలు వస్తుంటే.. సింక్‌లో వెనిగర్, బ్యాకింగ్ సోడా వేసి వేడి నీళ్లు వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల సింక్ లోపల కూడా క్లీన్‌గా ఉంటుంది. చీమలు ఇకరావు.

ఇక బట్టలు పెట్టే ప్రాంతంలో కూడా చీమలు ఎక్కువగా పడుతుంటాయి. ఇలా బట్టలకు చీమలు పడితే వాటిని వదిలించడం చాలా కష్టం. అంతేకాదు ఆ బట్టలు వేసుకుంటే ప్రమాదం. అందుకే బట్టలు ఎక్కువగా ఒకే చోట ఉంటే చీమలు పడుతుంటాయి. అందుకే వాటిని మారుస్తూ ఉండాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఏదైనా వాటర్ లీక్ అవుతుందేమో పరిశీలించాలి. ఎందుకంటే చీమలు చల్లని ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి.

చీమలు రాకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించాలి.

వేప నూనె, కర్పూరం..ఉప్పు, పశుపు ఈ రెండు మిశ్రమాలను వంట గదిలో వాడొచ్చు. అదేవిధంగా తడి ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఫినాయిల్ వేయడం మంచిది. చీమలకు ఫినాయిల్ వాసన పడదు. అందుకే ఆ చుట్టుపక్కలకు కూడా చీమలు రావు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, జాగ్రత్తలు తీసుకుంటే చీమల బెడదను తగ్గించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories