Kitchen Hacks: కోడిగుడ్లను సరిగ్గా ఉడికించడం ఎలా?

Kitchen Hacks: కోడిగుడ్లను సరిగ్గా ఉడికించడం ఎలా?
x
Highlights

Kitchen Hacks: కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అంతేకాదు మనకు చాలా బలాన్ని ఇస్తాయి. కోడిగుడ్లలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు,...

Kitchen Hacks: కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అంతేకాదు మనకు చాలా బలాన్ని ఇస్తాయి. కోడిగుడ్లలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి. ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు ఇస్తే..వాళ్లు బలంగా, ద్రుఢంగా తయారు అవుతాయి. చిన్నవారే కాదు..ఏ వయసులోని వారైనా కూడా కోడి గుడ్లను రోజు తినవచ్చు. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉంటే తగ్గిపోతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కటేంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా కోడిగుడ్డు చెక్ పెడుతుంది.

అయితే కోడి గుడ్లను ఉడికించి తీసుకుంటేనే అందులోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి. కోడిగుడ్లను కూడా సరైన పద్ధతిలో ఉడకబెట్టాలి. కానీ చాలా మందికి కోడి గుడ్లను ఎలా ఉడకబెట్టాలో తెలియదు. కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దానివల్ల కోడి గుడ్ల మీద ఉండే పొట్టు సరిగ్గా రాదు. దీంతో గుడ్లు ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అలా కొన్నిసార్లు గుడ్లు గట్టిగా మారుతాయి. ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ఉండలంటే కోడి గుడ్లను సరైన పద్ధతిలో ఉడకబెట్టాలి. కొంతమంది కోడి గుడ్లను ఇలా వేసి అలా దించేస్తుంటారు. మరికొంతమంది చాలా ఎక్కువ సమయం ఉడకబెడుతుంటారు. అసలు కోడిగుడ్లను ఎంతసేపు ఉడికించాలో ఇప్పుడు చూద్దాం.

కోడిగుడ్లు ఉడకటానికి 10లేదా 15నిమిషాలు సరిపోతుంది. కోడిగుడ్డులోని పచ్చనసొన ఉడకటానికి 4 లేదా 5 నిమిషాలు పడుతుంది. గుడ్డు పూర్తిగా ఉడికేందుకు 10లేదా 15నిమిషాలు సరిపోతుంది. అలాగే గుడ్లు ఉడకబెట్టేందుకు ఒకదాని మీద ఒకటి వేయకూడదు. అలాగే గుడ్లు మునిగే వరకు నీళ్లు పోయాలి. ఉప్పు వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన గుడ్లలోని నీటిని పారబోసి..మళ్లీ చల్లని నీరు కానీ..ఐస్ క్యూబ్స్ కానీ వేసి ఓ ఐదు నుంచి 10 నిమిషాలు వేసి అలాగే ఉంచాలి. ఇలా చేస్తే కోడి గుడ్లపై ఉండే పొట్టు సులభంగా రావడంతోపాటు..పూర్తిగా హెల్దీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉడికించిన గుడ్లను ఫ్రిజ్ లో వారం పాటు స్టోరే చేసుకోవచ్చు. కానీ గుడ్లపై ఉన్న షెల్ ను తొలగించకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories