Kiwi fruit : కివీ పండుతో జాగ్రత్త.. ఆరోగ్యం కోసమని ఎక్కువగా తింటే ఈ 5 సమస్యలు తప్పవు!

Kiwi fruit : కివీ పండుతో జాగ్రత్త.. ఆరోగ్యం కోసమని ఎక్కువగా తింటే ఈ 5 సమస్యలు తప్పవు!
x

Kiwi fruit : కివీ పండుతో జాగ్రత్త.. ఆరోగ్యం కోసమని ఎక్కువగా తింటే ఈ 5 సమస్యలు తప్పవు!

Highlights

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా కివీ పండు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. విటమిన్-సి తో పాటు అనేక పోషకాలకు ఇది గని వంటిది.

Kiwi fruit : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా కివీ పండు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. విటమిన్-సి తో పాటు అనేక పోషకాలకు ఇది గని వంటిది. అయితే, ఆరోగ్యానికి మంచిదని మరీ ఎక్కువ తింటే, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా అది విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కివీ పండు కొందరికి అస్సలు పడదు. అలాగే, మోతాదుకు మించి తింటే దానివల్ల కలిగే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. కివీ పండును అధికంగా తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, ఎవరు దీనిని తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అలర్జీ ఉన్నవారికి కివీ పండు విషంతో సమానం

కివీ పండులో ఉన్న ఒక రకమైన ప్రోటీన్ కొంతమందిలో తీవ్రమైన అలెర్జీలకు కారణం అవుతుంది. కివీ పండులో ఆక్టినిడిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది కొందరికి పడదు. దీనివల్ల నోరు లేదా గొంతులో దురద, వాపు, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీకు గతంలో అరటిపండు లేదా అవకాడో వంటి పండ్లతో అలర్జీ ఉంటే, కివీ పండు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నోటిలో మంట, జీర్ణక్రియ సమస్యలు

కివీ పండును ఎక్కువగా తినడం వల్ల నోరు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. కివీ పండులో ఉండే ఎంజైములు కొందరిలో నోరు, పెదవులు లేదా గొంతులో చికాకు లేదా మంట కలిగించవచ్చు. ఈ అనుభూతి తాత్కాలికమే అయినా, తగ్గించుకోవడానికి పండు పండిన తర్వాత తొక్క తీసి తినడం మంచిది. కివీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అధికంగా తింటే పొట్టలో గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వారానికి ఒకటి లేదా రెండు కివీ పండ్లకు మించి తినకూడదు. ముఖ్యంగా, పరగడుపున కివీ పండును అస్సలు తినకూడదు.

మందులు వాడేవారికి ప్రమాదకరం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు కివీ పండు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కివీ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక రక్తపోటు కోసం మందులు తీసుకునేవారు ఎక్కువగా కివీ తింటే, వారి రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే, రక్తాన్ని పలుచబడే మందులు తీసుకునే వారు కూడా కివీ పండు తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. కివీలో రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉంటుంది, కాబట్టి మందులతో కలిపి తింటే సమస్యలు తీవ్రమవుతాయి.

చర్మంపై దద్దుర్లు

కివీ తొక్కపై ఉండే చిన్న వెంట్రుకల లాంటి సూక్ష్మమైన నారలు కూడా కొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. కివీ పండుతో అలర్జీ ఉన్నవారు తొక్కను తాకినా, తిన్నా చర్మంపై చికాకు లేదా ఎరుపు రంగు దద్దుర్లు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. కివీ ఎంత ఆరోగ్యకరమైనదైనా, దానిని మితంగా తీసుకోవడం మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories