Lifestyle: చిన్నతనంలో దృష్టిలోపం ఉంటే.. పెద్దయ్యాక ప్రాణంతక సమస్యలు తప్పవు

Lifestyle: చిన్నతనంలో దృష్టిలోపం ఉంటే.. పెద్దయ్యాక ప్రాణంతక సమస్యలు తప్పవు
x
Highlights

Lifestyle: ప్రస్తుతం కంటి సంబంధిత సమస్యలు ఎక్కువుతున్నాయి. చిన్న తనంలోనే కళ్ల జోడ్లు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Lifestyle: ప్రస్తుతం కంటి సంబంధిత సమస్యలు ఎక్కువుతున్నాయి. చిన్న తనంలోనే కళ్ల జోడ్లు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తీసుకునే ఆహారంలో మార్పులు, మారిన జీవనశైలి, స్క్రీన్‌ టైమ్‌ పెరగడం ఇలా కారణం ఏదైనా చిన్నారుల్లో దృష్టి మాంద్యం బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్నతనంలో కంటి సమస్యల బారిన పడిన వారిలో పెద్దయ్యాక ప్రమాదక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

చిన్నతనంలో దృష్టి మాంద్యం (ఆంబ్లియోపియా) ఉన్నవారికి, పెద్దయ్యాక గుండె సంబంధిత వ్యాధులు, జీవక్రియ సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లోని బయో బ్యాంక్ ద్వారా 1.26 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు.

చిన్న తనంలో దృష్టిలోపం లేని వారితో పోల్చితే, ఉన్న వారిలో ఊబకాయం ముప్పు వచ్చే అవకాశం 16% ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. అదే విధంగా ఇలాంటి వారిలో అధిక రక్తపోటు ముప్పు 25% ఎక్కువ. మధుమేహం ముప్పు 29% ఎక్కువ. గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా అధికంగా ఉంటుందని వెల్లడైంది.

ఆంబ్లియోపియాను లేజీ ఐగా కూడా చెబుతుంటారు. ఈ సమస్య ఉన్న వారిలో ఒక కంటిలో చూపు తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ కన్ను లోపలికి లేదా బయటకు తిరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా పుట్టినప్పటి నుంచి ఏడేళ్ల వయస్సు మధ్య ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బాల్యంలోనే దృష్టి సమస్యలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి. కంటిచూపు బలహీనంగా ఉన్న పిల్లలకు తగిన వైద్య పర్యవేక్షణ అందించాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories