Wearing Tight Clothes : బిగుతు దుస్తులు వేసుకుంటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే ?

Wearing Tight Clothes
x

Wearing Tight Clothes : బిగుతు దుస్తులు వేసుకుంటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే ?   

Highlights

Wearing Tight Clothes : నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కొత్త ఫ్యాషన్‌ను ఫాలో కావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

Wearing Tight Clothes: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కొత్త ఫ్యాషన్‌ను ఫాలో కావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్‌లోకి కొత్త ట్రెండ్ రాగానే దాన్ని ప్రయత్నించకపోతే మనశ్శాంతిగా ఉండదనేంతగా ఫ్యాషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. స్టైలిష్‌గా కనిపించడానికి చాలా మంది ఇష్టపడే దుస్తుల్లో బిగుతుగా, శరీరానికి అతుక్కుపోయే బట్టలు ఒకటి. ఈ దుస్తులు మీకు స్టైలిష్‌ లుక్ ఇచ్చినా, వీటిని ఎక్కువసేపు ధరించడం వల్ల మీ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. అందం కోసం వెంపర్లాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ముందు, బిగుతు దుస్తులు ధరించడం వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం.

ఆఫీస్, కాలేజీ లేదా పని చేసే చోట తరచుగా బిగుతు దుస్తులు ధరించే అలవాటు ఉంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశోధనల ప్రకారం, బిగుతు దుస్తులు తరచుగా లేదా ఎక్కువసేపు ధరించడం వల్ల ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. ఇది శరీరానికి చాలా హానికరం. అందుకే, అలాంటి దుస్తులు ధరించడాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి, ముఖ్యంగా ప్రతిరోజూ ధరించకూడదు. బిగుతు దుస్తులు కొందరికి సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ వాటిని ధరించడం వల్ల శరీరానికి సరైన విశ్రాంతి లభించదు.

టైట్ బట్టలు, సాగే దుస్తులు లేదా శరీరానికి గట్టిగా అతుక్కుపోయే బట్టలు ధరించడం వల్ల కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. నిరంతరంగా ఉండే యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల అన్నవాహిక దెబ్బతింటుంది, ఆహారాన్ని మింగడం కష్టమవుతుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు బిగుతు దుస్తులు ధరిస్తే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

బిగుతు దుస్తులు కేవలం జీర్ణవ్యవస్థపైనే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. బిగుతుగా ఉండే ప్యాంట్లు లేదా షేప్‌వేర్ వంటి లోదుస్తులు శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేయవచ్చు. బిగుతు దుస్తులు వేసుకుని వ్యాయామం చేసేటప్పుడు వచ్చే చెమట వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రతిరోజూ ఉపయోగించే షేప్‌వేర్, ప్యాంటీహౌస్, టైట్ బ్రాలు వంటి లోదుస్తులు కూడా చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. టొరంటో యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. బిగుతుగా ఉండే వ్యాయామ దుస్తులు మహిళల క్రీడా ప్రదర్శనపై కూడా ప్రభావం చూపుతాయి. బిగుతు దుస్తులలో వ్యాయామం చేయడం తప్పు కానప్పటికీ, ఇది అందరికీ సౌకర్యంగా ఉండకపోవచ్చు. వ్యాయామం చేసేటప్పుడు మీకు ఎక్కువ చెమట పడుతుంటే, చర్మ సమస్యలు రాకుండా ఉండటానికి బిగుతు దుస్తులు ధరించకపోవడం మంచిది. మీ సౌకర్యం ఉండే విధంగా దుస్తులను ఎంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories