Milk for Glowing Skin: పాలతో అందంగా మారొచ్చు!.. స్కిన్ కేర్‌కు బెస్ట్ నేచురల్ టిప్స్ ఇవే

Milk for Glowing Skin
x

Milk for Glowing Skin: పాలతో అందంగా మారొచ్చు!.. స్కిన్ కేర్‌కు బెస్ట్ నేచురల్ టిప్స్ ఇవే

Highlights

Milk for Glowing Skin: చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుకోవాలంటే ఖరీదైన క్రీములు తప్పనిసరి కాదు. మన ఇంట్లో సులభంగా దొరికే పాలు చాలు అని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

Milk for Glowing Skin: చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుకోవాలంటే ఖరీదైన క్రీములు తప్పనిసరి కాదు. మన ఇంట్లో సులభంగా దొరికే పాలు చాలు అని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. పాలతో మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి అనేక స్కిన్ సమస్యలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. పాలతో స్కిన్ కేర్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజ మాయిశ్చరైజర్‌గా పాలు

చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే పచ్చి పాలు చాలా ఉపయోగపడతాయి. రోజుకు ఒక్కసారి ముఖానికి పాలు అప్లై చేస్తే చర్మానికి అవసరమైన సహజ కొవ్వులు, ప్రొటీన్లు అందుతాయి. దీంతో చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.

డీ-ట్యాన్ కోసం

పాలలో గుమ్మడి గింజల పొడిని కలిపి వారానికి మూడు సార్లు ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. దీంతో స్కిన్ తాజాగా, సహజ కాంతితో మెరిసిపోతుంది.

ముడతలు తగ్గాలంటే

పాలలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. పాలలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం టైట్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

మచ్చలు పోవాలంటే

ముఖంపై ఉన్న మొండి మచ్చలు తగ్గాలంటే పాలలో కొద్దిగా తేనె కలిపి అప్లై చేయాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే క్రమంగా మచ్చలు తగ్గుతాయి.

మీగడతో పొడి చర్మానికి పరిష్కారం

పొడి చర్మం, పొట్టు రాలడం వంటి సమస్యలున్నవారు కాచిన పాలపై పేరుకునే మీగడను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మానికి పోషణనిచ్చి తేమను పెంచుతుంది.

బ్రైట్‌నెస్ కోసం

పచ్చి పాలలో కొద్దిగా శనగపిండిని కలిపి ప్రతిరోజూ ముఖానికి అప్లై చేస్తే కొద్ది రోజుల్లోనే మెరిసే, కాంతివంతమైన చర్మం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తంగా, పాలు సహజంగా చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories