Furniture Care in Monsoon: వర్షాకాలంలో మీ ఫర్నిచర్‌ సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

Furniture Care in Monsoon: వర్షాకాలంలో మీ ఫర్నిచర్‌ సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!
x

Furniture Care in Monsoon: వర్షాకాలంలో మీ ఫర్నిచర్‌ సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

Highlights

Furniture Care in Monsoon: వర్షాకాలం వచ్చినప్పుడు చల్లదనం మనసుకు సంతోషం ఇచ్చినప్పటికీ, మన ఇంటి చెక్క ఫర్నీచర్‌కు ఇది శత్రువుగా మారుతుంది. గాలిలో తేమ...

Furniture Care in Monsoon: వర్షాకాలం వచ్చినప్పుడు చల్లదనం మనసుకు సంతోషం ఇచ్చినప్పటికీ, మన ఇంటి చెక్క ఫర్నీచర్‌కు ఇది శత్రువుగా మారుతుంది. గాలిలో తేమ పెరగడం వల్ల ఫర్నీచర్ ఉబ్బిపోవడం, బూజు పట్టడం, చెడు వాసన రావడం, చెదలు పట్టడం లాంటి సమస్యలు మొదలవుతాయి. ఖరీదైన ఫర్నీచర్ అయినా, రోజూ ఉపయోగించే సామానైనా సరే... ఈ తేమ నుండి వాటిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం.

కేవలం ఈ 5 సులభమైన చిట్కాలు పాటిస్తే, మీరు మీ ఫర్నీచర్‌ను కొత్తదిలా మెరిసేలా ఉంచవచ్చు:

1. ఉప్పు లేదా బొగ్గు బ్యాగులు వాడండి

ఉప్పు, బొగ్గు వంటివి గాలిలో తేమను సహజంగా పీల్చుకుంటాయి. చిన్న కాటన్ బ్యాగుల్లో ఇవి నింపి ఫర్నీచర్ డ్రాయర్లు, మూలల్లో ఉంచితే తేమను ఆకర్షించి ఫర్నీచర్‌ను పొడిగా ఉంచుతాయి. ప్రతి 15-20 రోజులకు బ్యాగులు మార్చడం మంచిది.

2. కర్పూరం, నాఫ్తలీన్ బాల్స్ వాడకండి

బూజు, పురుగుల సమస్య నివారించేందుకు కర్పూరం లేదా నాఫ్తలీన్ ఉండలను డ్రాయర్లు, అల్మారాల్లో ఉంచండి. వేపాకు లేదా లవంగాలు వంటి సహజ మార్గాలు కూడా ఉపయోగపడతాయి. వీటిని నెలకోసారి మార్చడం ఉత్తమం.

3. వాక్స్ పాలిష్ లేదా వార్నిష్

చెక్క ఫర్నీచర్‌పై వాక్స్ పాలిష్ లేదా వార్నిష్ వేసితే అది రక్షణ కవచంలా పని చేస్తుంది. ఇది తేమ చొరబడకుండా అడ్డుకుంటుంది. సిలికాన్ ఆధారిత పాలిష్ వాడితే మరింత మెరుగైన రిజల్ట్స్ వస్తాయి.

4. పొడి గుడ్డ, వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి

తడిగా ఉండే గుడ్డలు వాడటం వలన బూజు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి కనీసం 2–3 సార్లు పొడి మైక్రోఫైబర్ గుడ్డతో తుడవాలి. మూలల శుభ్రతకు బ్రష్ అటాచ్‌మెంట్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి.

5. తడి గోడల దగ్గర పెట్టకండి

ఫర్నీచర్‌ను గోడలకు ఆనకుండా కనీసం 4–6 అంగుళాల దూరంలో ఉంచాలి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది, తేమ దూరంగా ఉంటుంది. అవసరమైతే వెనుక చెక్క లేదా ప్లాస్టిక్ స్పేసర్లు వాడండి.

అదనపు చిట్కాలు:

సిలికా జెల్ ప్యాకెట్లు డ్రాయర్లు, కప్‌బోర్డ్స్‌లో ఉంచండి.

తడిగా ఉన్న ఫర్నీచర్‌ను ఎండలో ఉంచవద్దు – నీడలోనే ఆరబెట్టండి.

వర్షాలు, నీటి లీకేజీల సమయంలో – ఫర్నీచర్ కింద ఇటుకలు పెట్టి ఎత్తుగా ఉంచండి.

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే, మీ ఫర్నీచర్ వర్షాకాలంలో కూడా కొత్తదిలా మెరిసిపోతుంది!


Show Full Article
Print Article
Next Story
More Stories