Moringa Water: ఈ నీళ్లు తాగితే కొండలాంటి పొట్ట అయినా కరిగిపోవడం ఖాయం..!

Moringa Water
x

Moringa Water: ఈ నీళ్లు తాగితే కొండలాంటి పొట్ట అయినా కరిగిపోవడం ఖాయం..!

Highlights

Moringa Water Sheds Extra Kilos: బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. దీనికి సరైన జీవనశైలి అవలంబించడం ఎంతో ముఖ్యం.

Moringa Water Sheds Extra Kilos: బరువు అతిగా ఉన్నవాళ్లు తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రధానంగా రెగ్యులర్ ఎక్సర్ సైజ్‌తోపాటు లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. డైట్ కూడా ఎంతో ప్రాధాన్యం. అతిగా బరువు ఉన్నవాళ్లు ఈ నీటిని తాగితే ఎన్ని కిలోలు అయినా తగ్గిపోవాల్సిందే.

ఇది సహజంగా మీ అతి బరువును తగ్గించేస్తుంది. రోజు ఉదయం మునగా ఆకుతో తయారు చేసిన నీటిని తీసుకోవటం వల్ల ఎన్ని కిలోలైనా సులభంగా తగ్గిపోవాల్సిందే. మునగ నీరు మంచి డిటాక్స్‌ నీరు. ఇందులో ఖనిజాలు పుష్కలం. మీకు రోజంతటికీ కావలసిన రీఫ్రెష్మెంట్‌ కూడా అందిస్తుంది. సహజంగా మెటబాలిజం రేటును కూడా పెంచే గుణం ఇందులో ఉంది. అంతేకాదు మునగ నీటిని తీసుకోవడం వల్ల జీవన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎన్ని కిలోలు ఉన్నా కరిగిపోవాల్సిందే..

మునగ నీటిని తీసుకోవడం అద్భుతం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలం. ఇది బరువు ఎక్కువగా ఉన్నవాళ్లను సులభంగా తగ్గించేస్తుంది. దీంతో బరువు కూడా సులభంగా తగ్గిపోతారు. మునగ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఇది పెరగనివ్వదు. సహజసిద్ధంగా మెటబాలిజం రేటును పెంచి కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గించేస్తుంది.

మునగ నీటిని తయారు చేసుకునే విధానం..

మునగ పొడి లేదా తాజా మునగ ఆకులను ఒక గోరువెచ్చని నీటిలో వేసి కాస్త అందులో నిమ్మరసం, తేనె వేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి డిటాక్సిఫికేషన్‌ శరీరానికి అందుతుంది. అయితే ఈ డ్రింక్ ని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. పడుకునే ముందు కూడా ఈ నీటిని తీసుకోవచ్చు.

మునగాకు నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ కాలేయం డిటాక్సిఫై అయిపోతుంది. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీంతో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది.

మునగాకు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ప్రధానంగా గర్భిణులకు వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. డాక్టర్లను సంప్రదించి ఈ మునగాకు పొడిని డైట్ లో చేర్చుకోవాలి తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories