Most Common Lies: మోస్ట్ కామన్ అబద్దాలు.. వినగానే చిరునవ్వొచ్చే సత్యాలు..!

Most Common Lies
x

Most Common Lies: మోస్ట్ కామన్ అబద్దాలు.. వినగానే చిరునవ్వొచ్చే సత్యాలు..!

Highlights

Most Common Lies: మనమంతా జీవితంలో ఏదో ఒక సమయంలో అబద్దాలు చెబుతూనే ఉంటాం. కొన్ని అవసరాల కోసమైతే, కొన్ని సమస్యలను తప్పించుకునేందుకు చెబుతాం. ముఖ్యంగా మన దేశంలో కొన్ని అబద్దాలు చాలా కామన్‌గా వినిపిస్తుంటాయి. అవేంటో చూద్దాం!

Most Common Lies: మనమంతా జీవితంలో ఏదో ఒక సమయంలో అబద్దాలు చెబుతూనే ఉంటాం. కొన్ని అవసరాల కోసమైతే, కొన్ని సమస్యలను తప్పించుకునేందుకు చెబుతాం. ముఖ్యంగా మన దేశంలో కొన్ని అబద్దాలు చాలా కామన్‌గా వినిపిస్తుంటాయి. అవేంటో చూద్దాం!

రెండు నిమిషాల్లో వస్తున్నా!

ఇది మన దేశంలో ఎక్కువగా వినిపించే అబద్దం. ఎంత దూరంలో ఉన్నా సరే.. ఎవరైన ఫోన్ చేస్తే వెంటనే.. ఒక్క రెండు నిమిషాల్లో వస్తున్నా అని అబద్దం చెప్పడం.

రేపటి నుంచే మానేస్తా..

స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వ్యసనాలు ఉన్నవాళ్లు ఎక్కువగా చెప్పే అబద్ధం ఇది. ఇది చివరి సిగరెట్/పెగ్ రా.. రేపటి నుంచీ మానేస్తా అని చెబుతారు కానీ ఆ రేపు ఎప్పుడూ రాదు.

ఫోన్ సైలెంట్‌లో ఉండిపోయింది

కొంత మంది ఎన్ని కాల్స్ చేస్తున్నా, వాట్సాప్ మెసేజ్ పంపినా కావాలని స్పందించరు. కానీ, తర్వాత ఫోన్ సైలెంట్‌లో పెట్టేసా రా, తెలియలేదు.. అని సింపుల్‌గా సమాధానం చెబుతారు.

ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర

డబ్బుల విషయం వచ్చినప్పుడు కొంతమంది ..నమ్ము రా, ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు అని అంటారు.

నువ్వే నా ఫస్ట్ లవ్..

ఇది ప్రేమలో పడినప్పుడు చాలా మంది చెబుతారు. ఇది నిజంగా ఉన్నా మంచిదే, కానీ ఈ మాట ఎంది మందికి చెప్పి ఉంటారో మనకు తెలియదు. కానీ, ప్రేమలో అబద్దాలు 'ఇన్నొసెంట్‌గా' కనిపించడమే ప్రత్యేకత.

నేను అసలు అబద్ధం చెప్పను

ఇది వినగానే నవ్వొస్తుంది. అబద్ధం చెప్పడం గురించి మాట్లాడుతూనే.. అబద్ధమే చెబుతారు. మనుషులు కొన్ని నిఇజాలు, కొన్ని అబద్ధం చెప్పడం సహజం. కానీ కొంత మంది మాత్రం నేను అసలు అబద్ధం చెప్పను అంటూనే చెబుతుంటారు.

పనుంది రా.. రావలేను

ఎవరినైనా కలవమన్నా, ఎక్కడికైనా వెళ్లమన్నా.. వెళ్లాలనిపించకపోతే సరైన కారణం చెప్పడం బదులు పనుంది అని సింపుల్‌గా తప్పించుకుంటాం. ఇది సూటిగా చెబితే బాధపడతారని అలా చెప్పకుండా పని ఉంది రాలేను అంటూ అబద్ధం చెప్పడం అందరికీ అలవాటైపోయింది. మొత్తంగా చూస్తే..ఈ అబద్దాలు సంబంధాలను కాపాడుకోవడం కోసం చెప్పే చిన్న చిన్న మాటలు. కానీ, అబద్ధాలకి బదులుగా సత్యం చెబుతూ ముందుకు సాగితే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories