Eye Drops : ఐ డ్రాప్స్ వేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Eye Drops : ఐ డ్రాప్స్ వేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
x

 Eye Drops : ఐ డ్రాప్స్ వేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Highlights

సాధారణంగా కంటి సమస్యలు వచ్చినప్పుడు లేదా డాక్టర్ సలహా మేరకు మనం ఐ డ్రాప్స్ వాడుతుంటాం.

Eye Drops : సాధారణంగా కంటి సమస్యలు వచ్చినప్పుడు లేదా డాక్టర్ సలహా మేరకు మనం ఐ డ్రాప్స్ వాడుతుంటాం. అయితే చాలామంది ఈ డ్రాప్స్‌ను ఎలా వాడాలో, ఎన్ని చుక్కలు వేసుకోవాలో సరిగా తెలుసుకోరు. కంట్లో రెండు చుక్కలు వేస్తే సరిపోతుందిలే అనుకుంటారు. కానీ, ఇది చాలా పెద్ద పొరపాటు అని మీకు తెలుసా? ఐ డ్రాప్స్‌ను సరైన పద్ధతిలో వాడకపోతే, అది కంటికి మేలు చేయకపోగా, మరింత హాని కలిగించే ప్రమాదం ఉంది. ఈ విషయంలో డాక్టర్లు కొన్ని ముఖ్యమైన సూచనలు, సరైన పద్ధతి గురించి చెబుతున్నారు.

చాలామంది ఐ డ్రాప్స్ వేసుకునే ముందు చేతులు కడుక్కోవడం మర్చిపోతారు. కానీ ఇది చాలా తప్పు. డ్రాప్స్ వేసేటప్పుడు మన చేతులు కంటిని తాకాల్సి వస్తుంది. ఒకవేళ చేతులు శుభ్రంగా లేకపోతే, చేతులపై ఉన్న బ్యాక్టీరియా లేదా ఇన్‌ఫెక్షన్ నేరుగా కంటిలోకి చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్లలో మంట పెరగడం లేదా కంటికి హాని జరిగే అవకాశాలు ఎక్కువ. మన కళ్లు చాలా సున్నితమైనవి కాబట్టి, డ్రాప్స్ వేసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం.

కంటికి డ్రాప్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడూ ఒక్క చుక్క మాత్రమే వేయాలి. ఒక చుక్క కంటే ఎక్కువ వేయడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. పైగా, కంటిలో ఎక్కువ ద్రవం నిలిచే అవకాశం లేకపోవడం వల్ల ఆ డ్రాప్స్ కన్నీళ్ల రూపంలో బయటకు పోతాయి. ఒకవేళ డాక్టర్ రెండు కళ్లకు డ్రాప్స్ వేయమని సూచిస్తే, ముందుగా ఒక కంటికి వేసిన తర్వాతే మరొక కంటికి వేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకేసారి రెండు కళ్లలో వేయకూడదు.

ఐ డ్రాప్ వేసుకునే సరైన పద్ధతి ఏమిటంటే.. ముందుగా పైకి చూడండి. ఒక చేత్తో కింది కనురెప్పను మెల్లగా కిందికి లాగండి. ఆ ఏర్పడిన సంచి వంటి భాగంలో ఒక చుక్క డ్రాప్‌ను వేయండి. డ్రాప్ వేసిన తర్వాత, కనీసం ఒక నిమిషం పాటు కళ్లు మూసుకుని ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం వేసిన మందు కంటిపై ప్రభావవంతంగా పని చేస్తుంది. కళ్లు మూయడం వల్ల ఔషధం కంటి ఉపరితలంపై నిలిచి, సరిగ్గా లోపలికి ఇంకేందుకు సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories