రాత్రిపూట తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా.?

why not to eat not at night might not be ideal
x

 రాత్రిపూట తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా.?

 

Highlights

మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామన్న దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామన్న దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆహారాన్ని తీసుకునే విధానంలో చేసే తప్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఇక మనలో చాలా మంది రాత్రి పూట ఆహారాన్ని తీసుకోకూడదనే భావన ఉంటుంది. రాత్రి పూట పూర్తిగా ఆహారాన్ని మానేస్తే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిజంగానే రాత్రి ఆహారాన్ని తీసుకోకపోతే ఆరోగ్యంగా ఉంటామా.? అసలు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.

రాత్రి పూట పూర్తిగా భోజనం తీసుకోవడం మానేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాత్రి భోజనం మానేస్తే ఆకలిగా ఉంటుంది. ఇలా ఆకలితో పడుకుంటే మరుసటి రోజు శక్తి తగ్గుతుంది.భోజనం పూర్తిగా మానేస్తే గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు జరుగుతాయి. దీంతో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

రాత్రుళ్లు పూర్తిగా భోజనం మానేస్తే శరీరంలో హార్మోన్‌ల అసమతులత ఏర్పడి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. దీని వల్ల మళ్లీ తినే పరిస్థితి వస్తుంది. దీంతో తెలియకుండానే ఎక్కువగా తింటుంటాం. రాత్రి భోజనం తీసుకోవడం మానేస్తే అసిడిటీ, అల్సర్‌ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇక రాత్రంతా ఏం తినకుండా ఉంటే శరీర శక్తి తగ్గిపోయి, మరుసటి రోజు ఉదయం అలసటగా అనిపిస్తుంది. రాత్రి భోజనాన్ని మానేయకపోతే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి పూటతేలికపాటి, పోషకాహారంతో నిండిన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. కూరగాయలతో తయారైన సూప్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. రాత్రి పడుకునే ముందు మిక్స్‌డ్ వెజిటేబుల్ సాలడ్ లేదా పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇక బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్ తినడం కూడా మంచిది. అలాగే పప్పు రసం, తేలికపాటి అన్నం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories