No Sugar Challenge: 10 రోజులు పంచదార మానేస్తే శరీరంలో జరిగే వింతలు ఇవే..కొత్త ఏడాదిలో ఈ స్వీట్ ఛాలెంజ్ చేస్తారా ?

No Sugar Challenge
x

No Sugar Challenge: 10 రోజులు పంచదార మానేస్తే శరీరంలో జరిగే వింతలు ఇవే..కొత్త ఏడాదిలో ఈ స్వీట్ ఛాలెంజ్ చేస్తారా ? 

Highlights

No Sugar Challenge: కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ రకరకాల తీర్మానాలు చేసుకుంటుంటారు.

No Sugar Challenge: కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ రకరకాల తీర్మానాలు చేసుకుంటుంటారు. అయితే ఈసారి మీ ఆరోగ్యం కోసం ఒక క్రేజీ ఛాలెంజ్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అదే నో షుగర్ ఛాలెంజ్. కేవలం 10 రోజుల పాటు పంచదారకు దూరంగా ఉంటే మీ శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బరువు తగ్గడం దగ్గరి నుంచి ముఖం కాంతివంతంగా మారడం వరకు.. ఈ 10 రోజుల ప్రయాణం మీ జీవితాన్ని మార్చేయగలదు.

నేటి కాలంలో షుగర్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఒక ట్రెండ్‌గా మారింది. కేవలం బరువు తగ్గడానికే కాదు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం పెట్టడానికి ఇది గొప్ప మార్గం. నిజానికి మనం తినే పండ్లు, కూరగాయలు, పాల పదార్థాల్లో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది, అది శరీరానికి హాని చేయదు. కానీ, మనం విడిగా కలుపుకునే పంచదార, ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి శత్రువులని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా పంచదార మానేసినప్పుడు మొదట్లో కాస్త తలనొప్పి, నీరసంగా అనిపించినా, ఆ తర్వాత కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం..మీరు పంచదార మానేసిన 6 రోజుల్లోనే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒక వారం గడిచేసరికి మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. అంటే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక 10వ రోజుకు వచ్చేసరికి మీ చర్మం సహజంగా మెరుస్తుంది. మొటిమలు తగ్గడం, ముఖంపై కాంతి పెరగడం మీరు గమనించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు నియంత్రణలోకి రావడం ఈ 10 రోజుల్లోనే మొదలవుతుంది.

మనం తెలియకుండానే రోజుకు కావాల్సిన దానికంటే ఎక్కువ చక్కెరను తీసుకుంటున్నాం. ఆరోగ్య నిపుణుల లెక్క ప్రకారం..ఒక ఆరోగ్యవంతుడైన పెద్ద మనిషి రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు. అదే 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకైతే రోజుకు 14 గ్రాములే పరిమితి. మీరు నెల రోజుల పాటు చక్కెరను పూర్తిగా పక్కన పెట్టి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మీ శరీర బరువులో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇది కేవలం తూకం తగ్గడమే కాదు, మీ ఆయుష్షును పెంచే మార్గం కూడా.

ప్రారంభంలో స్వీట్లు, కూల్ డ్రింక్స్ మానేయడం ఒక పెద్ద సవాలుగా అనిపించవచ్చు. కానీ, ఒకసారి మీ శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడితే, ఆ తర్వాత మీ ఎనర్జీ లెవల్స్ ఎప్పుడూ హైగా ఉంటాయి. ఈ కొత్త ఏడాదిలో మీ శరీరాన్ని మీరు ప్రేమించుకోవాలనుకుంటే, ఈ 10 రోజుల నో షుగర్ ఛాలెంజ్ స్వీకరించండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.

Show Full Article
Print Article
Next Story
More Stories