Noche Buena Beer: ఏడాదిలో 15 రోజులు మాత్రమే లభించే నోచే బ్యూనా బీర్ స్పెషల్ ఏంటి?

Noche Buena Beer: ఏడాదిలో 15 రోజులు మాత్రమే లభించే నోచే బ్యూనా బీర్ స్పెషల్ ఏంటి?
x

Noche Buena Beer: ఏడాదిలో 15 రోజులు మాత్రమే లభించే నోచే బ్యూనా బీర్ స్పెషల్ ఏంటి?

Highlights

మెక్సికోలో క్రిస్మస్ సమయంలో మాత్రమే లభించే నోచే బ్యూనా బీర్ ఎందుకు ప్రత్యేకం? ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే అమ్మే ఈ బీర్ కథ తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక పానీయాలు నిర్దిష్ట సందర్భాల్లో మాత్రమే లభిస్తుంటాయి. అయితే మెక్సికోలో మాత్రం ఒక బీరు సంవత్సరానికి కేవలం 15 రోజులు మాత్రమే అమ్మకానికి వస్తుంది. అదే ‘నోచే బ్యూనా’ (Noche Buena Beer). క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని సంప్రదాయంగా ఈ బీరును విడుదల చేస్తారు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండని ఈ బీరు క్రిస్మస్ సెలవుల సమయంలో మాత్రమే మెక్సికోలో లభిస్తుంది.

BBC కథనం ప్రకారం, ప్రపంచంలోని వివిధ దేశాల్లో క్రిస్మస్‌ను ప్రత్యేక పానీయాలతో జరుపుకునే సంప్రదాయం ఉంది. ప్యూర్టోరికోలో కోక్విటో, జర్మనీలో గ్లుహ్వీన్ (ముల్లెడ్ వైన్) ప్రాచుర్యంలో ఉంటే, మెక్సికోలో మాత్రం మాల్ట్‌తో తయారైన బోక్-స్టైల్ బీర్ ‘నోచే బ్యూనా’ క్రిస్మస్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.

‘నోచే బ్యూనా’ అంటే స్పానిష్‌లో ‘పవిత్ర రాత్రి’ లేదా ‘క్రిస్మస్ ఈవ్’ అని అర్థం. ఈ బీరు సాధారణంగా క్రిస్మస్‌కు కొన్ని వారాల ముందే మార్కెట్‌లోకి వస్తుంది. అయితే సెలవులు ముగిసిన వెంటనే అమ్మకాలు నిలిపివేస్తారు. క్రిస్మస్ సమయంలో కూడా ఇది మెక్సికో వెలుపల లభించదు.

మెక్సికో నగరాల్లో సూపర్ మార్కెట్లలో నోచే బ్యూనా బాటిళ్లు కనిపిస్తే క్రిస్మస్ సెలవులు మొదలయ్యాయని అక్కడి ప్రజలు భావిస్తారని ‘Tequila! Distilling the Spirit of Mexico’ పుస్తక రచయిత్రి మేరీ సరితా గైటన్ పేర్కొన్నారు. ఈ బీరు అందుబాటులోకి రావడం క్రిస్మస్ వేడుకలకు సంకేతంగా మారిందని ఆమె వివరిస్తున్నారు.

ఈ బీరు చరిత్ర 1924 సంవత్సరానికి చెందింది. జర్మన్ మాస్టర్ బ్రూవర్ ఒట్టో న్యూమాయర్ క్రిస్మస్ సందర్భంగా తన స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఒక బీరును తయారు చేశాడు. ఆ రుచి అందరికీ నచ్చడంతో, 1938లో ఒరిజాబా బ్రూవరీ దీనిని సెలవుల కాలంలో ప్రజలకు ప్రత్యేక పానీయంగా విడుదల చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో మాత్రమే ‘నోచే బ్యూనా’ను విక్రయించే సంప్రదాయం కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories