Brushing : ఒక రోజు బ్రష్ చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రాణానికే ముప్పు తెచ్చే భయంకరమైన రోగాలివే

Brushing : ఒక రోజు బ్రష్ చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రాణానికే ముప్పు తెచ్చే భయంకరమైన రోగాలివే
x

Brushing : ఒక రోజు బ్రష్ చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రాణానికే ముప్పు తెచ్చే భయంకరమైన రోగాలివే

Highlights

చలికాలంలో కొందరు బ్రష్ చేయడాన్ని తప్పించుకోవాలని చూస్తారు. ఒక్క రోజేగా బ్రష్ చేయకపోతే ఏమవుతుందిలే? అని తేలికగా తీసుకుంటారు.

Brushing : చలికాలంలో కొందరు బ్రష్ చేయడాన్ని తప్పించుకోవాలని చూస్తారు. ఒక్క రోజేగా బ్రష్ చేయకపోతే ఏమవుతుందిలే? అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ చిన్న అలవాటు ప్రాణానికి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మొత్తంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం చాలా అవసరం. తిన్న తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే నోటిలోని బ్యాక్టీరియా చక్కెర, పిండి పదార్థాలను ఆమ్లంగా మారుస్తుంది. ఈ ఆమ్లం పంటి పైపొరను దెబ్బతీయడం మొదలుపెడుతుంది.

బ్రష్ చేయకపోతే నోటిలో ఏం జరుగుతుంది?

సాధారణంగా మనం ఆహారం తిన్న తర్వాత, 4 నుంచి 6 గంటల్లో పళ్లపై ప్లేక్ అనే జిగురు పొర పేరుకుపోతుంది. ఆ తర్వాత 12 గంటలకు, ఈ ప్లేక్ గట్టిపడి టార్టార్గా మారుతుంది. 24 గంటలు గడిచేసరికి, చిగుళ్లలో వాపు వచ్చి, రక్తం కారడం, దుర్వాసన మొదలవుతుంది. ఢిల్లీలోని ఎయిమ్స్ దంత వైద్యుల ప్రకారం, మీరు ఒక రోజు బ్రష్ చేయడం మానేస్తే మీ నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక ప్రమాదాలు

క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోతే అది నోటి ఆరోగ్యానికే కాక మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదం. ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు బ్రష్ చేయకుండా ఉంటే ది లాన్సెట్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ బ్రష్ చేయని వ్యక్తులకు మరణించే ప్రమాదం 25% అధికంగా ఉంటుంది.

గుండె జబ్బులు : ఒక సంవత్సరం బ్రష్ చేయకుండా ఉంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి, ధమనులలోవాపును సృష్టించి, గుండె సమస్యలకు దారితీస్తుంది.

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: నోటిలో పెరిగిన బ్యాక్టీరియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు.

నోటి క్యాన్సర్ : పొగాకు ఉపయోగించకపోయినా, బ్రష్ చేయని వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

దంతక్షయం: ఒక సంవత్సరం బ్రష్ చేయకపోతే, పళ్లు పూర్తిగా కుళ్లిపోయి, దంతక్షయం, పురుగులు, తీవ్రమైన చిగుళ్ల నొప్పికి దారితీసి, చివరికి పళ్లు వదులై ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories