Grey Hair: తెల్ల జుట్టుకు చెక్... సహజంగా నల్లగా మార్చే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!

Grey Hair
x

Grey Hair: తెల్ల జుట్టుకు చెక్... సహజంగా నల్లగా మార్చే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!

Highlights

Home Remedies for White Hair: తెల్ల జుట్టు రాకుండా, సహజంగా నల్లగా ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? డాక్టర్లు సూచిస్తున్న 7 అత్యంత ప్రభావవంతమైన ఆహార పదార్థాలతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడం ఎలా జరుగుతుందో తెలుసుకోండి.

Home Remedies for White Hair: తెల్ల జుట్టు సమస్య కేవలం వయస్సు పెరగడం వల్ల మాత్రమే కాదు. శరీరంలోని Oxidative Stress, హార్మోన్ అసమతుల్యత, మరియు పోషకాల లోపం కూడా దీనికి కారణం. డాక్టర్లు, చర్మవ్యాధి నిపుణులు సూచించిన కొన్ని అత్యంత ప్రభావవంతమైన ఆహార పదార్థాలు జుట్టు సహజ నల్ల రంగును కాపాడటంలో సహాయపడతాయి.

1. గుడ్లు:

గుడ్లలో విటమిన్ B12, బయోటిన్ అధికంగా ఉంటాయి. B12 లోపం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం ద్వారా ఈ పోషకాలు నేరుగా అందుతాయి.

2. దానిమ్మ:

దానిమ్మలో విటమిన్ B6, విటమిన్ C, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఒత్తిడిని తగ్గించి, జుట్టు రంగు మారకుండా కాపాడతాయి.

3. ఉసిరి (Amla):

ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను రక్షించి, మెలనిన్ ఉత్పత్తిని పెంచి సహజ రంగును పదిలం చేస్తాయి.

4. గింజలు:

నల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు జింక్ మరియు కాపర్ (Copper) సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు మరమ్మతు, రంగు ఉత్పత్తికి సహాయపడతాయి.

5. పాలకూర:

ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడవచ్చు. పాలకూర రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ అందిస్తుంది.

6. వాల్‌నట్స్:

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టులో వాపును తగ్గించి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

7. పాలు – పెరుగు:

క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12తో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హోమ్ మేడ్ పెరుగు తీసుకోవడం ద్వారా జుట్టు పదిలం, నల్లగా ఉంటుంది.

మరిన్ని సూచనలు:

ధూమపానం తగ్గించడం

♦ సమయానికి భోజనం చేయడం

♦ థైరాయిడ్ వంటి రక్త పరీక్షలు చేయించడం

జన్యుపరమైన తెల్ల జుట్టు పూర్తిగా ఆహారంతో మార్చలేము, కానీ పోషకాల లోపం వల్ల వచ్చే తెల్ల జుట్టును నియంత్రించవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. జుట్టు సమస్యలు తీవ్రమైతే, లేదా ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉంటే, నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories