Pot Water in Summer: మట్టి కుండలో నీరు తాగడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే ఫ్రిజ్ వాటర్ జోలికి పోరు!

Pot Water in Summer:  కానీ, మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
x

Pot Water in Summer

Highlights

Pot Water in Summer: సాధారణంగా ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగడం చాలామంది చేస్తారు. కానీ, మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Pot Water in Summer: ఎండాకాలం దూసుకుని వచ్చేసింది. టెంపరేచర్లు ఇప్పుడే అదరగొట్టేస్తున్నాయి. భవిష్యత్ మరింత వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. ఎండాకాలం వచ్చిందంటే ఫ్రిజ్ నిండా బాటిల్స్ పెట్టేసి.. దాహం వేసినప్పుడల్లా గట..గటా.. ఓ బాటిల్ నీళ్లు తీసుకుని తాగేయడం చాలామందికి అలవాటు. ఇలా ఫ్రిజ్ వాటర్ తాగడం వలన అప్పటికప్పుడు రిలీఫ్ ఉంటుంది కానీ, కొద్దిసేపట్లోనే నోరు తడి ఆరిపోతుందనే విషయం అందరికీ అనుభవమే. ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్ నీళ్ళు కానీ, పూర్వం అలా కాదు కదా. మంచినీరు కాచి, వడబోసి.. మట్టి కుండల్లో పోసుకుని తాగేవారు. ఆరోగ్యంగా ఉండేవారు.

అవును.. మట్టి కుండలో నీటిని తాగడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు నిపుణులు. అవి తెలిస్తే ఫ్రిడ్జ్ నీటి జోలికి ఎవరూ వెళ్లారని చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇక్కడు తెలుసుకుందాం.

Pot Water in Summer: మట్టి కుండలు నీటిని చల్లబరచడమే కాకుండా, నీటిని సహజంగా శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి మరియు ఈ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందువల్ల ఈ వేసవిలో, ఫ్రిజ్ చల్లటి నీటికి బదులుగా, మట్టి కుండ నీటిని తాగి, ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

ఇవీ ప్రయోజనాలు..

  • కడుపులో ఎసిడిటీ పెరిగి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది . కుండలు తయారు చేయడానికి ఉపయోగించే బంక మట్టిలో ఉండే క్షార కారకాలు ఎసిడిటీతో చర్య జరిపి బ్యాలెన్స్ చేస్తుంది . దానివలన కడుపు సమస్యలు రాకుండా ఉంటాయి .
  • మట్టి పాత్రలలో నిల్వ చేసిన నీరు త్రాగటం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం, మట్టి పాత్రలలో నిల్వ చేసిన నీరు శరీరం నుండి మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
  • మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అందువల్ల, ప్రతిరోజూ మట్టి కుండలో నీరు త్రాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే, ఈ నీటిలో ఉండే ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి .
  • వేసవిలో ఎడ్లకు వడదెబ్బ తగలడం సహజంగా జరుగుతుంది . మట్టి కుండల్లో నీరు వడదెబ్బ నుంచి రక్షిస్తుంది . డీహైడ్రేషన్ నివారించి శరీరం త్వరగా హైడ్రేట్ కావడానికి ఉపయోగపడుతుంది .
  • ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మట్టి కుండలోని నీరు గొంతు, ప్రేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, కుండ మట్టితో తయారు చేసినది అయి ఉండడంతో ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మట్టి కుండలోని మట్టి నీటి నుండి మలినాలను తొలగిస్తుంది. ఈ నీరు శరీరంలోని విష పదార్థాలను శుభ్రపరుస్తుంది.

గమనిక: ఇక్కడ పేర్కొన్న అంశాలు వివిధ సందర్భాల్లో నిపుణులు వెల్లడించిన విషయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటిని పరిగణించే ముందు మీ వైద్యుల సలహా కూడా తీసుకోవలసిందిగా సూచిస్తున్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories