Anant-Radhika: మోస్ట్ స్టైలిష్ పీపుల్ లిస్టులో అనంత్-రాధిక

Radhika Merchant and Anant Ambani Named Among Most Stylish People of 2024
x

Anant-Radhika: మోస్ట్ స్టైలిష్ పీపుల్ లిస్టులో అనంత్-రాధిక

Highlights

Anant-Radhika: న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ లిస్టులో అనంత్ అంబాని - రాధిక అంబానీ చోటు సంపాదించుకుని మరో ఘనతను సొంతం చేసుకున్నారు.

Anant-Radhika: న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ లిస్టులో అనంత్ అంబాని - రాధిక అంబానీ చోటు సంపాదించుకుని మరో ఘనతను సొంతం చేసుకున్నారు. మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 జాబితాలో అనంత్-రాధిక అత్యంత స్టైలిష్ వ్యక్తుల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వివాహ సమయంలో వారు ధరించిన దుస్తులు, నగలు, అత్యంత వైభవంగా జరిగిన వారి వివాహ కార్యక్రమాలు పరిగణలోకి తీసుకున్నట్టు వెల్లడించింది.

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ఈ ఏడాది జులైలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. ఇక ప్రతి వేడుకలో వధూవరులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేశాయి. వీరి వివాహానికి దేశవిదేశాల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనంత్-రాధిక ఎంతో విలువైన దుస్తులతో మెరిసిపోయారు. వారి ఆచారాల ప్రకారం ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహ్ తో మొదలైన వివాహ వేడుకలు.. శుభ్ ఆశీర్వాద్, మంగళ్ ఉత్సవ్ తో ముగిశాయి. రాధిక మర్చంట్ వెడ్డింగ్ డ్రెస్ ను సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పూర్తిగా గుజరాతి సంప్రదాయంలో ఈ వెడ్డింగ్ డ్రెస్ ఉంది. ఈ డ్రెస్‌కు సంబంధించిన ఎంబ్రాయిడరీని చేతితో నేయడం విశేషం. ఈ డ్రెస్‌కు సంబంధించిన ఘాగ్రాను డిజైన్ చేసే సమయంలో విలువైన రత్నాలు మొదలైనవి ఉపయోగించడం జరిగింది. వెడ్డింగ్ డ్రెస్ లో రాధిక మర్చంట్ అచ్చం రాణిలా కనిపించారు. ఇక అదే రీతిలో అనంత్ అంబానీ యువరాజుగా కనిపించారు. ఇలా మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో వారు ధరించిన డ్రెస్సులు, ఆభరణాలు హాట్ టాపిక్ మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories