Health: రానున్న రోజుల్లో పిల్లలు పుట్టడం కష్టమేనా? పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు

Health
x

Health: రానున్న రోజుల్లో పిల్లలు పుట్టడం కష్టమేనా? పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు

Highlights

Health: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, అధిక ఒత్తిళ్లు.. ఇలా కారణాలు ఏవైనా ఇటీవల సంతానలేమి సమస్య తీవ్రంగా మారుతోంది.

Health: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, అధిక ఒత్తిళ్లు.. ఇలా కారణాలు ఏవైనా ఇటీవల సంతానలేమి సమస్య తీవ్రంగా మారుతోంది. మహిళలతో పాటు పురుషుల్లోనూ ఇది పెద్ద సమస్యగా మారుతోంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. తాజాగా విడుదలైన ఓ పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘హ్యూమన్ రిప్రొడక్షన్ అప్‌డేట్’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, గత 45 ఏళ్లలో పురుషుల స్పెర్మ్ కౌంట్ సగానికి పైగా తగ్గింది. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే కాలంలో ఇది మరింత తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.

స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల ప్రధాన కారణాలు:

పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హర్మోన్ అసమతుల్యత సాధారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అవేవిధంగా పలు జన్యుపరమైన సమస్యలు, ప్రైవేట్ పార్ట్ ఇన్ఫెక్షన్లు, గనోరియా వంటి లైంగిక వ్యాధులు కూడా తక్కువ స్పెర్మ్ కౌంట్‌కు దారితీస్తాయి. ఇక అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధిక కొవ్వుతో కూడిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి సమస్యలు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కారణమవుతున్నాయి.

వీటితో పాటు అధికంగా ధూమపానం చేయడం, మద్యం సేవించడం పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతోంది. అలాగే గాలి, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఎండోక్రైన్ వ్యవస్థకు హాని చేసే రసాయనాలు ఇతర హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి. ఇవి కూడా పురుషుల్లో సంతానలేమి సమస్యలు రావడానికి కారణంగా మారుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

స్పెర్మ్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి?

స్పెర్మ్‌ కౌంట్ తగ్గితే.. పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా నిత్యం వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా.. మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యం పూర్తిగా మానేయాలి. నాణ్యమైన నిద్ర, హార్మోన్ బ్యాలెన్స్ కోసం అవసరమైన వైద్య సహాయం తీసుకోవాలి. ఈ చిన్న మార్పులతోనే పురుషులు తమ స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories