Rice vs. Chapati : అన్నం vs చపాతీ.. బాగా నిద్రపోవాలంటే రాత్రిపూట ఏది తినాలి?

Rice vs. Chapati : అన్నం vs చపాతీ.. బాగా నిద్రపోవాలంటే రాత్రిపూట ఏది తినాలి?
x

Rice vs. Chapati : అన్నం vs చపాతీ.. బాగా నిద్రపోవాలంటే రాత్రిపూట ఏది తినాలి?

Highlights

మనం తినే ఆహారం నిద్రపై ప్రభావం చూపుతుంది. కొంతమంది రాత్రి భోజనానికి రకరకాల ఆహారాలు తీసుకుంటారు. నాలుకకు రుచి దొరుకుతుంది, కానీ కళ్ళు మూసినా నిద్ర రాదు. మనలో చాలామంది మధ్యాహ్నం అన్నం తింటే, రాత్రి చపాతీ తింటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ ఉన్నవారు ఎక్కువగా చపాతీలను ఎంచుకుంటారు.

Rice vs. Chapati : మనం తినే ఆహారం నిద్రపై ప్రభావం చూపుతుంది. కొంతమంది రాత్రి భోజనానికి రకరకాల ఆహారాలు తీసుకుంటారు. నాలుకకు రుచి దొరుకుతుంది, కానీ కళ్ళు మూసినా నిద్ర రాదు. మనలో చాలామంది మధ్యాహ్నం అన్నం తింటే, రాత్రి చపాతీ తింటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ ఉన్నవారు ఎక్కువగా చపాతీలను ఎంచుకుంటారు. కానీ మంచి నిద్ర కావాలంటే, ఈ రెండింటిలో ఏది తినడం మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. ఏ ఆహారం తీసుకుంటే బాగా నిద్ర వస్తుంది? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రాత్రి భోజనానికి అన్నం తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా, అన్నం త్వరగా జీర్ణమవుతుంది. అందుకే చాలామంది రాత్రిపూట అన్నం తినడానికి ఇష్టపడతారు. అన్నం ఒక అధిక గ్లైసెమిక్ ఆహారం, ఇది మెదడులో ట్రిప్టోఫాన్ విడుదలకు సహాయపడుతుంది, దీని వల్ల త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు.

చపాతీ తినడం వల్ల ఇలా జరగొచ్చు

చపాతీలలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు. డయాబెటిస్ ఉన్నవారు చపాతీలు తినడం మంచిది. అయితే, చపాతీలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట చపాతీలు తింటే కడుపు ఉబ్బరంగా లేదా భారంగా అనిపించవచ్చు.

నిద్రకు ఏది బెస్ట్ ?

మీరు తీసుకునే ఆహారం మీ నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. రాత్రి భోజనం సులభంగా జీర్ణం కావాలి, శరీరం ఎక్కువగా శ్రమ పడకూడదు అనుకుంటే అన్నం తినడం మంచిది. దీని వల్ల త్వరగా నిద్ర వస్తుంది. చపాతీలు తింటే కడుపు ఉబ్బినట్లు, బరువుగా అనిపించవచ్చు. అందుకే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి భోజనానికి చపాతీ కంటే అన్నం మంచిది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories