Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారికి ఏది మంచిది?

Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారికి ఏది మంచిది?
x

Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారికి ఏది మంచిది?

Highlights

డయాబెటిస్ పేషెంట్స్‌లో ఒక సాధారణమైన సందేహం – రాత్రి భోజనానికి రైస్ తినాలా? లేక చపాతీ తినాలా? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెటర్ అనేది చూద్దాం.

డయాబెటిస్ పేషెంట్స్‌లో ఒక సాధారణమైన సందేహం – రాత్రి భోజనానికి రైస్ తినాలా? లేక చపాతీ తినాలా? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెటర్ అనేది చూద్దాం.

కార్బోహైడ్రేట్స్ & ఫైబర్ తేడా

ఒక కప్ రైస్ (మన చేతి నిండా)లో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

ఒక చపాతీలో మాత్రం సుమారు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి.

చపాతీలో రైస్‌తో పోలిస్తే 2 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చపాతీ తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. కానీ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.

పరిమాణమే ముఖ్యం

రాత్రి వేళలో డయాబెటిస్ ఉన్నవారు ఒక కప్ రైస్ తినవచ్చు. లేకపోతే రెండు చపాతీలు తీసుకోవచ్చు. అయితే రైస్ తినేటప్పుడు చాలామంది పరిమాణాన్ని కంట్రోల్ చేయకుండా ఎక్కువగా తింటారు. అదే బ్లడ్ షుగర్ పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది.

అందువల్ల రాత్రి భోజనానికి రెండు చపాతీలు తినడం డయాబెటిస్ పేషెంట్స్‌కి ఉత్తమం. రైస్ కూడా తినవచ్చు కానీ తప్పనిసరిగా పరిమితిని పాటించాలి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ప్రయత్నించే ముందు వైద్యుల లేదా న్యూట్రిషన్ నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories