Prostate Cancer: మగవారిలో పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్! జాగ్రత్తలు ఇలా..

Prostate Cancer: మగవారిలో పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్! జాగ్రత్తలు ఇలా..
x

Prostate Cancer: మగవారిలో పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్! జాగ్రత్తలు ఇలా..

Highlights

ప్రపంచవ్యాప్తంగా మగవారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నట్టు తాజా రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడిన మగవాళ్లకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందట.

ప్రపంచవ్యాప్తంగా మగవారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నట్టు తాజా రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడిన మగవాళ్లకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందట. ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి? దీనిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా అధ్యయనాల ప్రకారం ప్రస్తుతం ఏటా14 లక్షల మంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని తేలింది. 2040 నాటికి ఈ సంఖ్య 29 లక్షలకు పెరగొచ్చని అంచనా. మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు.. మగవారిలో ప్రొస్టేట్ గ్రంధిపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతున్నాయి. దీనికై ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ప్రొస్టేట్ అనేది కేవలం మగవారిలో మాత్రమే ఉండే గ్రంథి. దీన్నే పురుష గ్రంథి అని కూడా అంటారు. ఇది మగవారి పునరుత్పత్తి వ్యవస్థలో కీలకమైన అవయవం. స్పెర్మ్, సెమెన్ ఉత్పత్తికి ఈ గ్రంథి సాయపడుతుంది. ఇది మూత్రనాళాన్ని చుట్టుకుని ఉంటుంది. వయసుతోపాటు ఈ గ్రంథి సైజు పెరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది మరింత పెద్దగా ఉబ్బి క్యాన్సర్‌‌గా కూడా మారుతుంది.

వయసుతోపాటు ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బడం మామూలే. అయితే కొన్నిసార్లు ఇది క్యాన్సర్ లక్షణం కూడా కావొచ్చు. కాబట్టి ప్రొస్టేట్ సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బినప్పుడు మూత్రనాళం మీద ఒత్తిడి పడి, మూత్రం ధార సన్నబడటం, తరచూ యూరిన్‌కు వెళ్లాల్సి రావడం, యూరిన్‌కు వెళ్లినప్పుడు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్​ని సంప్రదించాలి. ఒకవేళ ఇది క్యాన్సర్ లక్షణమైతే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి.

జాగ్రత్తలు ఇలా..

ప్రొస్టేట్ క్యాన్సర్‌‌కు కచ్చితమైన కారణాలు లేవు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తల ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. ప్రొస్టేట్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో షుగర్, కెఫీన్, ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి.

స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ప్రొస్టేట్ సమస్యలను పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

ప్రొస్టేట్ వాపుని తగ్గించడం కోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. గ్రీన్ టీ, నట్స్, పండ్లు ఎక్కువగా తినాలి. విటమిన్ – డి, విటమిన్–సి ఉండే ఆహారాలు తీసుకోవాలి.

రోజూ మూడు నాలుగు లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తే ఆపుకోకుండా వెంటనే వెళ్లాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories