Salt: ఉప్పుతో అంతా ముప్పే.. ఈ లక్షణాలు కనిపిస్తే.. జర జాగ్రత్త

Salt
x

Salt: ఉప్పుతో అంతా ముప్పే.. ఈ లక్షణాలు కనిపిస్తే.. జర జాగ్రత్త

Highlights

Salt: ఏ ఆహారానికైనా రుచి రావాలంటే ఉప్పు తప్పనిసరి. ఉప్పులేకపోతే కూరలు చప్పగా ఉన్నట్టే సంతోషం లేకపోతే జీవితం చప్పగా ఉంటుందని పెద్ద వాళ్లు అంటారు. అవును రుచికరమైన భోజనం తింటేనే కదా సంతోషం.

Salt: ఏ ఆహారానికైనా రుచి రావాలంటే ఉప్పు తప్పనిసరి. ఉప్పులేకపోతే కూరలు చప్పగా ఉన్నట్టే సంతోషం లేకపోతే జీవితం చప్పగా ఉంటుందని పెద్ద వాళ్లు అంటారు. అవును రుచికరమైన భోజనం తింటేనే కదా సంతోషం. అందుకే అలా పోల్చి ఉంటారు. ఏది ఏమైనా ఉప్పు మాత్రం మనకు ఉండాల్సిందే. కానీ ప్రతిరోజు ఉప్పును తింటూ వెళితే.. శరీరంలోకి ఎంత ఉప్పు వెళుతుంది. అది చేస్తున్న దుష్పలితాలు ఏంటో మీకు తెలుసా? అయితే పదండి ఈ రోజు ఉప్పుతో వచ్చే ముప్పేంటో తెలుసుకుందాం.

కొంతమంది కూరలో ఉన్న ఉప్పుకంటే అది సరపోలేదు అని కాస్త పక్కన వేసుకుని కలుపుకుని మరీ తింటుంటారు. ఇలాంటి వారు ఇక ముందు ముందు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పు శరీరంలోకి వెళ్ళి రకరకాల ప్రాణాంతక వ్యాధులు రాడానికి కారణం అవుతోందని వెల్లడిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఉప్పు ఎక్కువగా తింటే..

ఎక్కువ ఉప్పు తింటే అరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ అది హాని చేస్తే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ లక్షణాలను ముందే గుర్తిచేస్తే కాస్త ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా కడుపులో వాపు వస్తుంది. అదేవిధంగా వేళ్లు, పాదాలలో కూడా వాపులు కనిపిస్తాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. బీపీ అకస్మాత్తుగా పెరగడం లేదా తరచూ దాహం వేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారి శరీరంలో ఉప్పు ఎక్కువైందని అర్ధం. వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించి సరైన మెడిసిన్ తీసుకోవాలి.

ఒక రోజులో ఎంత ఉప్పు తినాలి?

ఒక రోజులో ఎంత ఉప్పు తినాలనేదానికంటే అసలు ఉప్పే తినకూడదని నియమం పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా కుదరకపోతే కనీసం రోజులో 5 గ్రాములకు మించకుండా ఉప్పును తినాలి. అది శరీరంలో 2వేల మిల్లీ గ్రాముల సోడియంను పూర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువ తింటే శరీరంలో సోడియం లెవెల్ పెరిగిపోతుంది. దీనివల్ల బీపీ, మూత్రపిండాలు ఫెయిల్ అయ్యే సమస్యలు తలెత్తుతాయి.

ఉప్పును ఎలా తగ్గించుకోవాలి?

కూరల్లో తప్ప మరే ఇతర పదార్ధాల్లో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చట్నీలు, సాండ్ విచ్‌లు, సలాడ్‌లను ఎక్కువగా తినేవాళ్లు ఉప్పును పూర్తిగా తగ్గించాలి. అంతేకాదు, నిల్వ పచ్చళ్లు, ప్యాకెట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంట్లో చేసిన వంట అది కూడా చాలా తక్కువ ఉప్పు వేసిన వంట తినడం ఆరోగ్యానికి చాలా మంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories