Sankranti Special: ఆహా ఏమి రుచి! సంక్రాంతికి పిండి వంటలు ఇక ఆన్‌లైన్‌లోనే ఆర్డర్

Sankranti Special: ఆహా ఏమి రుచి! సంక్రాంతికి పిండి వంటలు ఇక ఆన్‌లైన్‌లోనే ఆర్డర్
x

Sankranti Special: ఆహా ఏమి రుచి! సంక్రాంతికి పిండి వంటలు ఇక ఆన్‌లైన్‌లోనే ఆర్డర్

Highlights

సంక్రాంతి పండుగ వేళ సకినాలు, అరిసెలు, గారెలు వంటి పిండి వంటలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంట్లో తయారీకి బదులు ఆన్‌లైన్ ఆర్డర్లపై నగరవాసులు, విదేశాల్లోని తెలుగువారు ఎక్కువగా ఆధారపడుతున్నారు.

Sankranti Special: సకినాలు, అరిసెలు, లడ్డూలు వీటితో పాటు ఇంకా బోలెడు రకాల పిండివంటలు ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి పండుగ సంపూర్ణం. సంక్రాంతి పండుగకు పదిరోజుల ముందే ప్రతి ఇంటా పొయ్యి వెలుగుతుంది. పిండి వంటలు సిద్ధం చేయడం పల్లెలోనే కాదు నగరంలోనూ ఏళ్లుగా వస్తోన్న ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఇదంతా మారిపోతోంది. నగర జనం నెట్టింటిపై ఆధారపడుతున్నారు. సులువుగా ఆర్డర్ ఇచ్చేసి హాయిగా సొంత పనుల్లో మునిగిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు.

సంబురాల సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగభాగ్యాలు, పిల్లాపాపలతో కళకళలాడుతాయి. గతంలో ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు పిండి వంటలు తయారు చేసి వడ్డించేవారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆయా వంటకాల తయారీలో పాలుపంచుకునేవారు. ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు, వివిధ పనుల రీత్యా పిండి వంటలు చేసే తీరికా, ఓపిక ఉండట్లేదు. మార్కెట్‌లో లభించే వాటిపై మొగ్గుచూపుతుండటంతో పండగ వేళ మంచి డిమాండ్‌ ఏర్పడింది.

ఈ ఏడాది పిండి వంటలకు గతంలో కంటే డిమాండ్‌ పెరిగిందని దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఉద్యోగ రీత్యా నగరంలో ఉండేవాళ్లు, సొంతూళ్లకు వెళ్లలేని వారు ఎక్కువగా కొంటున్నారని దుకాణాల యజమానులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గారెలు, ఉండ్రాళ్లు, అప్పాలు, అరిసెలు ఎక్కువగా డిమాండ్ ఉంది. దీంతో పది మందికి ఉపాధి లభించడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుందని పిండివంటల దుకాణాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు. సంక్రాంతి పండుగ నగర గృహిణులకు కలిసొస్తోంది.. ఇంటి బాధ్యతలు అయిపోయాక ఖాళీగా ఉండలేక పిండి వంటల తయారీని వ్యాపార మార్గంగా ఎంచుకుంటున్నారు నగర గృహిణులు. కొవిడ్‌ సమయంలోనూ చాలామందికి ఇంటిని పోషించేందుకు ఆదాయ వనరుగా ఉపయోగపడింది. ఏటా లక్షల సంఖ్యలో ఆర్డర్లు యూఎస్‌, యూకే, కెనడా, సింగపూర్‌, తదితర దేశాల నుంచి వస్తుండటంతో.. వాటి నుంచి అధిక మొత్తాన్ని ఆదాయంగా పొందుతున్నారు. సకినాల నుంచి చెక్కల వరకు, గారెల నుంచి అరిసెల దాకా అన్ని రకాల పిండివంటలకు భారీగా ఉందని.. ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

చిరుతిళ్లు చేసేందుకు విదేశాల్లో ఉండేవారికి సరైన ముడిసరుకులు, వనరులు లేకపోవడంతో పాటు ఉద్యోగాలతో తీరిక లేకపోవడం వల్ల.. వారందరికి భాగ్యనగరం దిక్కు అయ్యింది. ఇక్కడ చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాలు దాదాపు లక్షకు పైగా ఉన్నాయి. వారంతా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయగానే.. ఇక్కడ తయారీదారులు కొరియర్ సర్వీసులకు అందించి ట్రాకింగ్ లింకును కొనుగోలుదారులకు పంపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories