Self Care Tips: 5/15/30/60 నిమిషాల సెల్ఫ్‌కేర్‌ రూటీన్‌ – మీ కోసం మీరే ఖర్చు చేయాల్సిన సమయం ఇదే!

Self Care Tips: 5/15/30/60 నిమిషాల సెల్ఫ్‌కేర్‌ రూటీన్‌ – మీ కోసం మీరే ఖర్చు చేయాల్సిన సమయం ఇదే!
x
Highlights

Self Care Tips in Telugu: 5, 15, 30, 60 minutes సెల్ఫ్‌కేర్‌ రూటీన్‌తో శారీరక–మానసిక ఆరోగ్యం ఎలా మెరుగుపరచుకోవచ్చు? తేలికైన, ఇంట్లోనే చేయగల సింపుల్‌ చర్యలు ఇక్కడ చదవండి.

ఇప్పటి మనుషుల జీవితం — ఉద్యోగం, దాంపత్యం, పిల్లల పెంపకం, లక్ష్యాల సాధన — ఇవన్నీ కలగలసి పరుగులు పెట్టే రకం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ పరుగులో అందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు… స్వీయ సంరక్షణ (Self Care).

సెల్ఫ్‌కేర్‌ అంటే పెద్దగా టైమ్‌ తీసుకునే పనులేం కావు. మీరు అందుబాటులో ఎంత సమయం ఉన్నా — 5 / 15 / 30 / 60 నిమిషాలు — ఆ మేరకు సులభంగా చేయగల పనులు చాలానే ఉన్నాయి. వాటితో మానసికంగా, శారీరకంగా ఎంతో రిఫ్రెష్‌ అవ్వొచ్చు.

5 నిమిషాల సెల్ఫ్‌కేర్‌

చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ వెంటనే చేయగల చిన్న కానీ శక్తివంతమైన చర్యలు:

  1. 5 నిమిషాల ధ్యానం
  2. ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీరు తాగడం
  3. స్నేహితులకు ఒక చిన్న మెసేజ్ లేదా చాట్
  4. టీ/కాఫీ ని నిదానంగా ఆస్వాదించడం
  5. దేవుడిని ప్రార్థించడం
  6. రోజులో చేసిన మంచి పనులను గుర్తుచేసుకోవడం

వీటితో మూడ్‌ వెంటనే పాజిటివ్‌గా మారుతుంది.

15 నిమిషాల సెల్ఫ్‌కేర్‌ రూటీన్‌

కొంచెం టైమ్‌ దొరికితే ఇవి బెస్ట్‌ ఛాయిస్‌:

  1. పేపర్‌ లేదా మ్యాగజైన్‌ చదవడం
  2. ఆలోచనలను నోట్‌బుక్‌లో రాయడం
  3. రోజువారీ పనుల ప్రణాళిక
  4. ఇంటి మొక్కలకు నీరు పోయడం
  5. చిన్న వాకింగ్‌
  6. 15 నిమిషాల యోగా
  7. ఇష్టమైన సంగీతం వినడం

ఈ 15 నిమిషాలు మీ మనసును పూర్తిగా రీసెట్‌ చేస్తాయి.

30 నిమిషాల సెల్ఫ్‌కేర్‌

అరగంట టైమ్‌ దొరికితే ఇలా చేసుకోండి:

  1. స్నేహితుడితో కాస్త సుదీర్ఘంగా మాట్లాడటం
  2. పాడ్‌కాస్ట్‌ వినడం
  3. పుస్తకం చదవడం
  4. కామెడీ షో లేదా మంచి ప్రోగ్రామ్‌ చూడటం
  5. ఫేస్‌ మాస్క్‌ వేసుకోవడం
  6. వేడి/చల్లని నీటితో రిలాక్సింగ్‌ బాత్‌
  7. చిన్న టూర్‌ ప్లాన్‌ చేయడం

ఇవి మానసికంగా చాలా లైట్‌గా ఫీల్‌ చేయిస్తాయి.

60 నిమిషాల సెల్ఫ్‌కేర్‌

మీకు గంట సమయం దొరికితే ఇవి పరిపూర్ణమైన ఎంపికలు:

  1. మీకు ఇష్టమైన వంట చేయడం
  2. మెహందీ పెట్టుకోవడం లేదా గోళ్లకు నెయిల్‌ పాలిష్‌
  3. భార్య/భర్త/స్నేహితుడితో బయట విందు
  4. గంటలో పూర్తయ్యే చిన్న డ్రైవ్‌
  5. దగ్గరలో ఉన్న ఆలయం లేదా బంధువుల ఇంటికి వెళ్లడం
  6. టైమ్‌ ఎక్కువైతే సినిమా చూడటం

గంట సమయం పెట్టుకున్నా… ఎప్పటికీ లభించని మెంటల్‌ పీస్‌ దొరుకుతుంది.

ఎందుకు సెల్ఫ్‌కేర్‌ తప్పనిసరి?

  1. ఒత్తిడి తగ్గుతుంది
  2. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది
  3. నిద్ర నాణ్యత పెరుగుతుంది
  4. క్రియేటివిటీ, ఉత్సాహం పెరుగుతాయి
  5. సంబంధాలు మరింత బలపడతాయి

మీ సమయాన్ని బట్టి పై లిస్ట్‌ నుంచి ఏదైనా ఒక్కటి అయినా చేయండి… మీ జీవితం మరింత పాజిటివ్‌, ప్రశాంతంగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories