Fatty Liver: ఫ్యాటీ లివర్‌‌కు చెక్ పెట్టండిలా!

Fatty Liver: ఫ్యాటీ లివర్‌‌కు చెక్ పెట్టండిలా!
x

Fatty Liver: ఫ్యాటీ లివర్‌‌కు చెక్ పెట్టండిలా!

Highlights

లివర్‌‌లో కొవ్వు నిల్వలు పేరుకుపోయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

కామన్ ప్రాబ్లమ్

లివర్‌‌లో కొవ్వు నిల్వలు పేరుకుపోయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. దీన్ని సరిచేయకపోతే లివర్ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. ఫ్యాటీ లివర్‌‌ను ఎలా తగ్గించొచ్చుంటే..


డైట్ ఇలా..

ఫ్యాటీ లివర్‌‌ను హెల్దీ లివర్‌‌గా మార్చాలంటే లివర్‌‌ను డీటాక్స్ చేసే హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.


వ్యాయామం

రోజువారీ వ్యాయామం చేయడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. వ్యాయామం వల్ల ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. తద్వారా లివర్‌‌లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.


ఆల్కహాల్

ఆల్కహాల్ అలవాటు లివర్‌‌ను పాడు చేస్తుందని మనకు తెలిసిందే. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్లు, లివర్ పాడవ్వకూడదు అనుకునేవాళ్లు డ్రింకింగ్ హ్యాబిట్‌ను పూర్తిగా మానుకోవాలి.


బరువు తగ్గాలి

ఫ్యాటీ లివర్‌‌కు ఒబెసిటీ కూడా ఒక కారణం. కాబట్టి ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ముందుగా బరువు తగ్గాలి. జంక్ ఫుడ్, షుగర్ ఫుడ్స్‌ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.


హెర్బల్ టీలు

గ్రీన్ టీ, చామంతి టీ, బ్లూ టీ వంటి హెర్బల్ టీలు తాగడం, పుదీనా, కొత్తిమీర, తులసి వంటి ఆకులతో చేసిన డ్రింక్స్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లివర్‌‌ను డీటాక్స్ చేస్తాయి.


మెడిసిన్స్ ముఖ్యం

ఇక వీటితోపాటు ఫ్యాటీ లివర్ సమస్య ముదరకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా మందులు వాడడం, తరచూ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories