Sleep Deprivation: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు వచ్చినట్లే

Sleep Deprivation: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు వచ్చినట్లే
x
Highlights

Sleep Deprivation: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం.

Sleep Deprivation: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. అవును, సరైన నిద్ర లేకపోతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మానసిక చికాకు రావడమే కాకుండా, గుండె, కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. నిద్ర భంగం మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని లక్షణాల ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాటిని సకాలంలో గుర్తించకపోతే అవి తీవ్రంగా మారవచ్చు. అందువల్ల, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. మరి మనం సరిగ్గా నిద్రపోనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

మెదడుకు హాని

రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోని వారికి క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సరిపడా నిద్ర లేకపోవడం మీ మెదడుకు హాని కలిగిస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

మలబద్ధకం సమస్య

నిద్ర లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే, అది ప్రేగులలో అడ్డంకులు వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది.

జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది

శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా, జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది.

మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది

నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో శక్తి, సామర్థ్యం తగ్గుతాయి. దీంతో ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా, నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది ఒక వ్యక్తిలో చిరాకు, కోపాన్ని పెంచుతుంది. ఈ లక్షణాలు సాధారణంగా నిద్ర సరిగ్గా లేనప్పుడు మొదట కనిపిస్తాయి.

కంటి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు

నిద్ర లేకపోవడం వల్ల కళ్లపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి శరీరంలో పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) లేదా మచ్చలు కనిపిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories