Star Fruit: కంటి పొరలు రాకుండా ఆపే స్టార్ ఫ్రూట్.. ఈ పండు తింటే కలిగే 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Star Fruit: కంటి పొరలు రాకుండా ఆపే స్టార్ ఫ్రూట్..  ఈ పండు తింటే కలిగే 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
x

Star Fruit: కంటి పొరలు రాకుండా ఆపే స్టార్ ఫ్రూట్.. ఈ పండు తింటే కలిగే 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Highlights

చలికాలంలో మార్కెట్‌లో కనిపించే ప్రత్యేకమైన పండ్లలో నక్షత్ర పండు లేదా స్టార్ ఫ్రూట్ ఒకటి. దీని ఆకారం నక్షత్రంలా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

Star Fruit: చలికాలంలో మార్కెట్‌లో కనిపించే ప్రత్యేకమైన పండ్లలో నక్షత్ర పండు లేదా స్టార్ ఫ్రూట్ ఒకటి. దీని ఆకారం నక్షత్రంలా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. తెలుగులో దీనిని కమరద్రాక్ష లేదా ధారేహుళి అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం అవెర్హోవా క్యారంబోలా. ఈ పండు రుచి అద్భుతంగా ఉండటమే కాక, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

స్టార్ ఫ్రూట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి:

బరువు తగ్గడం: స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ B6 ఉంటుంది, ఇది శరీరంలో జీవక్రియల పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా, కేలరీలు త్వరగా ఖర్చై కొవ్వు తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి: ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాక, దగ్గు , జలుబు వంటి కాలానుగుణ వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది.

చర్మ సౌందర్యం: విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ: సుమారు 100 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఉపశమనం ఇచ్చి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

కంటి చూపు: దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, కళ్లను రక్షిస్తుంది. దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

కంటి పొర నివారణ: ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కళ్లలో పొర (కంటి శుక్లం) ఏర్పడటాన్ని నిరోధించవచ్చు అని నిపుణులు అంటున్నారు.

మెదడు పనితీరు: ఇందులో ఉండే విటమిన్ B6 మెదడు పనితీరును మెరుగుపరచి, ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

నరాల బలం: ఇది నరాల వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. నరాల బలహీనతను తగ్గిస్తుంది. మెడ, భుజాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ పండును వైద్యుల సలహా లేకుండా తీసుకోకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories