Biscuits Daily: టీతో పాటు రోజు బిస్కెట్లు తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Biscuits Daily: టీతో పాటు రోజు బిస్కెట్లు తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
x

Biscuits Daily: టీతో పాటు రోజు బిస్కెట్లు తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Highlights

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్నాక్స్‌లో బిస్కెట్లు లేదా కుకీలు ముందుంటాయి. ముఖ్యంగా టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు.

Biscuits Daily: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్నాక్స్‌లో బిస్కెట్లు లేదా కుకీలు ముందుంటాయి. ముఖ్యంగా టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు. అయితే, ప్యాకేజ్ చేసిన బిస్కెట్లలో మైదా, కృత్రిమ చక్కెరలు ఎక్కువగా ఉంటాయని భావించి, ఆరోగ్యం కోసం కొందరు ఇంట్లోనే ఆరోగ్యకరమైన పద్ధతిలో కుకీలను తయారు చేసుకుని తింటారు. కానీ, పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లు, కుకీలను కూడా ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదట. రోజూ ఇంట్లో చేసిన కుకీలు, బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.

ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లు లేదా కుకీలు కృత్రిమ స్వీటెనర్‌లు లేకుండా ఉన్నప్పటికీ, వాటిని రోజూ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కుకీలను తయారుచేసేటప్పుడు, వాటి తయారీలో మూడు భాగాలు పిండి, రెండు భాగాలు కొవ్వు, ఒక భాగం చక్కెర ఉపయోగిస్తారు. అంటే, ఒక కుకీలో దాదాపు 50 నుండి 70 శాతం పిండి, 15 నుండి 35 శాతం కొవ్వు, 10 నుండి 25 శాతం చక్కెర ఉంటాయి.

ఇంట్లో తయారు చేసినా లేదా బెల్లం, నెయ్యి ఉపయోగించి ఆరోగ్యకరమైన కుకీలను కొనుగోలు చేసినా... వాటిని రోజూ తినడం మంచిది కాదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే బిస్కెట్లు అనేవి ఎంప్టీ కేలరీస్ ఉన్న ఉత్పత్తులు. అంటే, వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు లేకుండా, కేవలం అదనపు చక్కెర, కొవ్వు మాత్రమే ఉంటాయి. ఇవి పిల్లలకు అప్పుడప్పుడు ఇవ్వవచ్చు, కానీ రోజూ తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఈ ఆహారాలలో సాధారణంగా శుద్ధి చేసిన పిండి, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలో అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి.

రోజు బిస్కెట్లు లేదా కుకీలను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి, మళ్లీ త్వరగా తగ్గిపోతాయి. దీని కారణంగా తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక పెరుగుతుంది. ఈ అలవాటు కాలక్రమేణా బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అంతేకాకుండా, ఎక్కువ బిస్కెట్లు, కుకీలు తినడం వల్ల నోటి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దంతాలు పుచ్చిపోవడానికి ఇది ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి, బిస్కెట్లకు బదులుగా విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే పండ్లు, నట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories