Health: పెద్దపేగు క్యాన్సర్ బారిన పడొద్దంటే.. ఆహారంలో ఇది ఉండాల్సిందే

Taking calcium can reduce colon cancer latest study says
x

పెద్దపేగు క్యాన్సర్ బారిన పడొద్దంటే.. ఆహారంలో ఇది ఉండాల్సిందే 

Highlights

ప్రస్తుతం పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 40 ఏళ్లు కూడా నిండని వారు పెద్ద పేగు క్యాన్సర్‌తో మరణిస్తున్న సందర్భాలున్నాయి.

ప్రస్తుతం పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 40 ఏళ్లు కూడా నిండని వారు పెద్ద పేగు క్యాన్సర్‌తో మరణిస్తున్న సందర్భాలున్నాయి.ప్రాసెస్‌ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌, జీవనశైలిలో మార్పులతో ఈ క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే భవిష్యత్తుల్లో పెద్ద పేగు క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో క్యాల్షియం ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

తాజా అధ్యయనాలు సూచిస్తున్న విధంగా తగినంత కాల్షియం తీసుకోవడం పెద్దపేగు క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తేలింది. శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం రోజుకు కనీసం 300 మి.గ్రా. కాల్షియం తీసుకునే మహిళల్లో పెద్దపేగు క్యాన్సర్ ముప్పు 17% తగ్గినట్టు తేలింది. పెద్దపేగులోని పైత్య రసాలు, కొవ్వు ఆమ్లాలను బంధించి, అవి శరీరానికి హానిచేయకుండా బయటకు వెళ్లేలా క్యాల్షియం చేస్తుంది.

శరీరానికి కాల్షియం రక్షణ కవచంలా పనిచేస్తుంది. పరిశోధకులు దీనిని 'సోప్‌ ఎఫెక్ట్‌'గా చెబుతున్నారు. కాల్షియం పైత్య రసాలను పేగుల్లో నిల్వ కాకుండా అవి బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇది పెద్దపేగులో క్యాన్సర్ కారక ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

కాల్షియం ఎక్కువగా పాలు, పెరుగు, ఆకు కూరలు, గింజలు, సోయా ప్రొడక్ట్స్, బాదం, ఆకుకూరలు వంటి తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది. అయితే కాల్షియం మాత్రలను తీసుకోవడం వల్ల ఇదే స్థాయిలో ఫలితం ఉంటుందా? అంటే ఇంకా ఇందుకు సంబంధించి పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. అయితే, సహజసిద్ధమైన ఆహారం ద్వారా కాల్షియం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories