Almonds : బాదం పప్పులు ఇలా తింటే మంచిది!

Almonds : బాదం పప్పులు ఇలా తింటే మంచిది!
x

 Almonds : బాదం పప్పులు ఇలా తింటే మంచిది!

Highlights

పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతీ ఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన నట్స్‌లో బాదం పప్పులు ముందుంటాయి. ఇవి సూపర్ హెల్దీ. అలాగని ఎక్కువగా తినకూడదు. వీటిని ఎలా తీసుకోవాలంటే..

సూపర్ నట్స్

పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతీ ఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన నట్స్‌లో బాదం పప్పులు ముందుంటాయి. ఇవి సూపర్ హెల్దీ. అలాగని ఎక్కువగా తినకూడదు. వీటిని ఎలా తీసుకోవాలంటే..

పది లోపే..

బాదం పప్పులు అతిగా తీసుకోకూడదు. రోజుకి ఆరు నుంచి పది బాదం పప్పులు తినొచ్చు. అది కూడా ఆరు గంటలు నానబెట్టి తీసుకుంటే మంచిది.

పొట్టు తీసి..

బాదం పప్పులను పొట్టు తీసి తినాలి. బాదం పప్పుల పొట్టులో ఉండే కాంపౌండ్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. కాబట్టి పూర్తిగా పొట్టు లేకుండా తినాలి.

స్వీట్స్

బాదం పప్పులను స్వీట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పప్పులను వేగించి పొడి చేసి.. బాదం లడ్డూ, బాదం హల్వా వంటి స్వీట్స్ చేస్తారు. వీటిని కూడా మితంగా తీసుకోవచ్చు.

బాదం పాలు

నానబెట్టిన బాదం పప్పుల నుంచి తీసే బాదం పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చాలామంది డెయిరీ పాలకు బదులు ఆల్మండ్ మిల్క్ ను తాగుతుంటారు. వీటిలో బాదం పప్పుల్లో ఉండే పోషకాలన్నీ ఉంటాయి.

మిల్క్ షేక్

బాదం పౌడర్‌‌తో చేసే బాదం టీ బాదం మిల్క్ షేక్ వంటివి కూడా ఆరోగ్యానికి మంచివే. కాకపోతే వీటిలో పోషకాల శాతం తక్కువ.

బెనిఫిట్స్ ఇవే..

బాదంలో హెల్దీ ఫ్యాట్స్‌తో పాటు విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ వంటి అన్నిరకాల పోషకాలుంటాయి. గుండె ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి.

Show Full Article
Print Article
Next Story
More Stories