Better Sleep:రాత్రి పడుకునే ముందు సాక్స్ ఎందుకు ధరించాలి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఇదే!

Better Sleep:రాత్రి పడుకునే ముందు సాక్స్ ఎందుకు ధరించాలి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఇదే!
x

Better Sleep:రాత్రి పడుకునే ముందు సాక్స్ ఎందుకు ధరించాలి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఇదే!

Highlights

నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య ఎదురవుతోంది. మంచి ఆరోగ్యం, చురుకుదనం కోసం రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి.

Better Sleep:నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య ఎదురవుతోంది. మంచి ఆరోగ్యం, చురుకుదనం కోసం రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. అయితే, గాఢ నిద్ర పొందడానికి కొందరు ధ్యానం, కంటి మాస్క్‌లు వంటి పద్ధతులు పాటిస్తారు. కానీ, నిపుణులు చెప్పే ఒక వింత చిట్కా ఏమిటంటే.. నిద్రపోయే ముందు సాక్స్ ధరించడం. అవును, సాక్స్ ధరించి పడుకుంటే పిల్లల మాదిరిగా హాయిగా నిద్రపోవచ్చట. సాక్స్ ఎలా నిద్రకు సహాయపడుతుంది? దీనికి సంబంధించిన శాస్త్రీయ కారణాలు ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్, వర్జీనియాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించేవారు వేగంగా నిద్రలోకి జారుకుంటారు. ఎక్కువ సమయం నిద్రపోతారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన బయోమెడికల్ సైంటిస్ట్ డాక్టర్ బీకిన్ లువో ప్రకారం, నిద్రపోయేటప్పుడు పాదాలను వెచ్చగా ఉంచడం వలన నిద్రపై సానుకూల ప్రభావం పడుతుంది.

మంచి నిద్ర పొందడానికి, రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టి, మంచి మాయిశ్చరైజర్ రాసి, ఆ తర్వాత సాక్స్ ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు సాక్స్ ధరించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది.

పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు, వాటిలోని రక్త నాళాలు విస్తరిస్తాయి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ మెరుగైన రక్త ప్రసరణ, రిలాక్సేషన్ ప్రక్రియ, మెదడుకు నిద్రపోవడానికి సంకేతాలు పంపి, త్వరగా గాఢ నిద్రలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. అందుకే సాక్స్ ధరించడం ద్వారా బాగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు.

పాదాలను వెచ్చగా ఉంచడం వల్ల నిద్ర మెరుగుపడుతున్నప్పటికీ, సాక్స్ ధరించేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల ప్రకారం, ధరించే సాక్స్ చాలా బిగుతుగా ఉన్నా, లేదా మురికిగా ఉన్నా, చెమట పేరుకుపోయి దురద, చర్మంపై దద్దుర్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. చాలా బిగుతుగా ఉండే సాక్స్ ధరిస్తే, అది రక్త ప్రవాహానికి అడ్డుగా మారి, పాదాలలో తిమ్మిరి లేదా మొద్దుబారిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి, నిద్రపోయే ముందు సాక్స్ ధరించాలనుకుంటే, తేలికపాటి పత్తి సాక్స్‌లను మాత్రమే ధరించాలి. బిగుతుగా ఉండే సాక్స్‌లను అస్సలు ధరించకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories