Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ వస్తే మొదట శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే!

Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ వస్తే మొదట శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే!
x
Highlights

Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ ఒక తీవ్రమైన వ్యాధి. కొన్నిసార్లు ఇది కేవలం సాధారణ కణతిగా ఉంటుంది. మరికొన్నిసార్లు మెదడులో క్యాన్సర్‌తో కూడిన ట్యూమర్‌గా కూడా మారుతుంది.

Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ ఒక తీవ్రమైన వ్యాధి. కొన్నిసార్లు ఇది కేవలం సాధారణ కణతిగా ఉంటుంది. మరికొన్నిసార్లు మెదడులో క్యాన్సర్‌తో కూడిన ట్యూమర్‌గా కూడా మారుతుంది. బ్రెయిన్ ట్యూమర్‌ను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. అప్పటికే వ్యాధి నయం చేయలేని స్థితికి చేరుకుంటుంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు చాలా తేలికగా ఉండటం వల్ల రోగులు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి, దానిని ఎలా గుర్తించాలి అనే వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రతి సంవత్సరం 50 వేల మందికి పైగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 20 శాతం మంది పిల్లలే. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ప్రధాన కారణాలలో పర్యావరణ మార్పులు, రసాయన మూలకాలు, విషపూరిత పదార్ధాలకు గురికావడం, జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవడం వల్ల దీని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్ వ్యాప్తి చెందిన తర్వాత చికిత్స కూడా కష్టతరమవుతుంది. కొన్నిసార్లు దీనికి చికిత్స ఉండదు.

ప్రారంభ లక్షణాలు

బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో దృష్టి మందగించడం, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, పదాలను ఉచ్చరించడంలో కష్టం, పదాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది, బలహీనతగా అనిపించడం, నడవడానికి, కొన్ని పనులు చేయడానికి ఇబ్బందిగా ఉండటం, వ్యక్తిత్వంలో మార్పులు రావడం. ఇందులో మానసిక స్థితిలో మార్పులు, కోపం వంటివి ఉండవచ్చు. దీనితో పాటు చెవుల్లో నిరంతరం గంట మోగినట్లు శబ్దం వినిపించడం కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు.

వైద్యుడిని సంప్రదించండి

పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. సకాలంలో చికిత్స ప్రారంభించడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ నుండి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ వ్యాప్తి చెందడం, దాని పరిమాణం పెరగడంతో చికిత్స చేసే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రారంభ లక్షణాలు కనిపించిన వెంటనే వాటిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories