True Friend: మంచి ఫ్రెండ్‌కు ఉండే క్వాలిటీస్ ఇవే!

True Friend: మంచి ఫ్రెండ్‌కు ఉండే క్వాలిటీస్ ఇవే!
x

True Friend: మంచి ఫ్రెండ్‌కు ఉండే క్వాలిటీస్ ఇవే!

Highlights

మీ ఆరోగ్యం బాగానే ఉందా? స్ట్రెస్, డిప్రెషన్ లాంటివేవీ లేవా? అయితే మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టే లెక్క.. అదేంటి ఫ్రెండ్స్‌కి, హెల్త్‌కి సంబంధమేంటి అనుకుంటున్నారా? మంచి ఫ్రెండ్స్ ఉంటే.. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని స్టడీలు చెప్తున్నాయి. అదెలాగంటే..

మీ ఆరోగ్యం బాగానే ఉందా? స్ట్రెస్, డిప్రెషన్ లాంటివేవీ లేవా? అయితే మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టే లెక్క.. అదేంటి ఫ్రెండ్స్‌కి, హెల్త్‌కి సంబంధమేంటి అనుకుంటున్నారా? మంచి ఫ్రెండ్స్ ఉంటే.. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని స్టడీలు చెప్తున్నాయి. అదెలాగంటే..

వయసు పైబడిన తర్వాత మెంటల్లీ హెల్దీగా ఉండాలంటే... ఇరవైల్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండాలట. అలాగే 30 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం స్నేహాలు ‘సెలక్టివ్‌’గా ఉంటే మంచిదట. అలాగే ఒక మనిషిని ఫ్రెండ్‌గా ఎంతవరకు నమ్మొచ్చు అని తెలుసుకునేందుకు స్టడీలు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తున్నాయి. అవేంటంటే..

లైఫ్ స్కిల్స్ నేర్పితేనే..

మంచి స్నేహితులు లైఫ్ స్కిల్స్ నేర్పుతారు. వాళ్లకు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో తెలుసు. ఫ్రెండ్‌కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇస్తారు. ఫ్రెండ్ ఆలోచనలకు, చేయాలనుకుంటున్న పనులకు సపోర్ట్ ఇస్తారు. ఫ్రెండ్ తీసుకున్న నిర్ణయాలను అందరూ ‘తప్పు’ అని చెప్పినా కూడా మన వెంటే ఉంటూ మెంటల్‌గా సపోర్ట్ ఇస్తారు. వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే వెనకడుగు వేస్తారో వాళ్లు నిజమైన ఫ్రెండ్స్ కానట్టు లెక్క.

కేర్ ఉంటే..

ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడూ కేర్ తీసుకుంటాడు. కుటుంబంలోని వ్యక్తిగా కలిసిపోతాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు సేవ చేయడానికి వెనకాడడు. అప్పుడే స్నేహితుడి ప్రేమను అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా అవసరం పడినప్పుడు సాకులు చెప్పి తప్పించుకుంటే వాళ్లను ఫేక్ ఫ్రెండ్స్‌గా భావించొచ్చు.

నష్టాన్ని కూడా..

నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్‌లో చిక్కుకుంటే వాళ్లు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి, ప్రాబ్లమ్‌ని షేర్ చేసుకుంటారు. నష్టాన్ని కూడా కలిసి పంచుకుంటారు. కానీ ఫేక్ ఫ్రెండ్స్ ఇలా చేయరు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సైలెంట్‌గా చూస్తూ ఉంటారే తప్ప పార్టిసిపేషన్ ఉండదు.

టైం ఇస్తారు

నిజమైన ఫ్రెండ్స్.. చెప్పే మాటలను శ్రద్ధగా వింటారు. ఫ్రెండ్ కోసం సమయం కేటాయిస్తారు. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా అవసరమై పిలిచినప్పుడు కచ్చితంగా వెంట ఉంటారు. అలా కాకుండా సాకులు చెప్పడం లేదా తప్పించుకోవడం లాంటివి చేస్తే అది నిజమైన స్నేహం కాదు.

కుటుంబంలా..

ఫ్రెండ్ కుటుంబాన్ని వాడి కుటుంబంగా భావించే వాడు ట్రూ ఫ్రెండ్. అయితే నకిలీ స్నేహితులకు కుటుంబాలంటే అంతగా నచ్చవు. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అంత పాజిటివ్‌గా ఉండరు. కుటుంబానికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్లతో కాస్త ప్రమాదమే.

ఇలా ఉంటేనే..

చాలామంది స్నేహితుల వల్లే తమ లోపాలు, నిజమైన ఇంట్రెస్టులు తెలుసుకోగలుగుతారు. తమ సొంత పర్సనాలిటీని బిల్డ్ చేసుకోగలుగుతారు. అలాంటి ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఎప్పుడూ హెల్దీగా ఉన్నట్టే. అందుకే మంచి స్నేహితులను గుర్తించడం, ఫేక్ ఫ్రెండ్స్​తో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మంచి స్నేహాన్ని గుర్తించడం ఎంత అవసరమో.. నిజమైన ఫ్రెండ్స్‌లా ఉండడమూ అంతే అవసరం అంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories