Insomnia: నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

Insomnia:  నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి
x

Insomnia: నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

Highlights

దేశంలో సుమారు నలభై శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

కామన్ ప్రాబ్లమ్

దేశంలో సుమారు నలభై శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. నిద్ర లేమి అనేది అనేక ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఈ సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి.


జంక్ ఫుడ్ వద్దు

నిద్ర పట్టకపోవడానికి రాత్రిపూట తినే ఫుడ్ కూడా కారణం అవ్వొచ్చు. కాబట్టి రాత్రిళ్లు ఎర్లీగా తినేయడం, డిన్నర్‌‌లో జంక్ ఫుడ్‌ తగ్గించి ఆకుకూరలు, ఫైబర్ ఉండే పదార్థాలు తినడం అలవాటుచేసుకోవాలి.


ఎన్విరాన్‌మెంట్

బెడ్‌రూమ్‌ క్లీన్‌గా, డిమ్ లైటింగ్‌తో ఉంటే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంటుంది. అలాగే నిద్ర పట్టడం కోసం మంచి సువానస వచ్చేలా డిఫ్యూజర్స్, తేలికపాటి మ్యూజిక్ వంటి ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు.


గాడ్జెట్స్ వద్దు

బెడ్ ఎక్కిన తర్వాత మొబైల్ వాడడం అలవాటు చేసుకుంటే రానురాను నిద్రపోయే సమయం తగ్గుతుంటుంది. కాబట్టి పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి వాడకుండా కంట్రోల్ చేసుకోవాలి.


వ్యాయామం ఉంటేనే

సాయంత్రం వేళల్లో కొంతసేపు వ్యాయామం చేస్తే.. ఒళ్లు అలసిపోయి రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.


టైం టేబుల్

ప్రతిరోజూ ఒక టైం టేబుల్ ప్రకారం నిద్ర పోవడానికి, నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే దాని ప్రకారం శరీరం ట్యూన్‌ అవుతుంది. ఆటోమెటిక్‌గా టైంకి నిద్ర వస్తుంది.


ఇవి కూడా..

నిద్రకు ముందు స్నానం చేయడం అలాగే పడుకునేముందు కాఫీ, టీ, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories