Health: కడుపు ఎప్పుడూ గందరగోళంగా ఉంటుందా.? వీటికి దూరంగా ఉండాల్సిందే

Health
x

Health: కడుపు ఎప్పుడూ గందరగోళంగా ఉంటుందా.? వీటికి దూరంగా ఉండాల్సిందే

Highlights

Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనలో కొందరికీ కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే కడుపులో గ్యాస్, మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనలో కొందరికీ కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే కడుపులో గ్యాస్, మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. నిత్యం కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఫుడ్స్‌ను వీలైనంత తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నూనెలో బాగా వేయించిన ఆహారాలు రుచికరంగా ఉంటాయి. కానీ తరచూ వీటిని తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కువ నూనె ఉంటే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పకోడీలు, బజ్జీలు, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ వంటి పదార్థాలు అధికంగా తింటే అజీర్తి, మలబద్దకం సమస్యలు వస్తాయి.

* కారం, మసాలాలతో చేసిన ఆహారాలు రుచిగా ఉన్నా, ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్ సమస్యలు రావచ్చు. కొన్ని మసాలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శరీరానికి మేలు చేస్తాయి. కానీ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు సమస్యగా మారతాయి.

* కొంతమందికి పాల ఉత్పత్తులను తీసుకున్న వెంటనే కడుపులో గందరగోళంగా ఉంటుంది. పాలలో ఉండే లాక్టోస్ అనే పదార్థం కొందరికీ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపునొప్పి, అజీర్తి, అలర్జీ సమస్యలు తలెత్తుతాయి.

* ఆకుకూరల్లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల పేగులకు మేలు చేస్తాయి. కానీ కొంతమంది వీటిని తిన్న వెంటనే అసౌకర్యంగా ఫీలవుతారు. ముఖ్యంగా ఉడకపెట్టని ఆకుకూరలను అధికంగా తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.

* రాజ్మా, బీన్స్, శనగలు, మినుములు వంటి పప్పులు అధికంగా ప్రొటీన్, ఫైబర్ కలిగి ఉంటాయి. కానీ కొందరి శరీరం వీటిని త్వరగా జీర్ణం చేసుకోలేవు. వీటివల్ల కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

* నిమ్మ, నారింజ, మోసంబి, బత్తాయి వంటి పండ్లు కొందరికి జీర్ణం కావు. వీటిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ కడుపులో మంటను పెంచవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.

గమనిక: ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories