Uric Acid: యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించే డ్రైఫ్రూట్‌ ఏంటో తెలుసా?

Uric Acid Reducing Dry fruits
x

Uric Acid: యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించే డ్రైఫ్రూట్‌ ఏంటో తెలుసా?

Highlights

Uric Acid Reducing Dry fruits: యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే గౌట్‌, కీళ్లనొప్పుల సమస్య వస్తుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలి. ప్రధానంగా ఇది ప్యూరీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుంది. దీనికి డైట్‌లో మార్పులు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తో యూరిక్ ఆసిడ్ ఎలా తగ్గించుకోవాలి తెలుసుకుందాం.

Uric Acid Reducing Dry fruits: ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినాలి.. ఇవి ఆరోగ్యకరం అంటారు. అయితే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి కూడా డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. కీళ్ల నొప్పులు కూడా రావు.

బాదం..

బాదంలో మెగ్నీషియం ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది. రాత్రి నానబెట్టి ఉదయం తొక్క తీసి తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. యూరిక్ యాసిడ్ సమతులం చేస్తుంది.

పిస్తా..

పిస్తాలో కూడా పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ పని తీరును మెరుగు చేస్తుంది. యూరిక్ యాసిడ్ బయటికి పంపించే గుణాలు కలిగి ఉంటాయి. యూరిక్ తగ్గాలంటే పిస్తాలు తినాలి.

వాల్ నట్స్

వాల్నట్స్ ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. యూరిక్ యాసిడ్‌ని తగ్గించేస్తాయి.. ఇది వాపు, నొప్పుల సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ. వాల్‌నట్స్‌ చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది.

ఫిగ్స్‌..

ఫిగ్స్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. వెయిట్‌ జర్నీలో ఉన్నవారు ఫిగ్స్‌ తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన అనుభూతి కలిగిస్తాయి. రాత్రి నానబెట్టి ఉదయం తినడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మన శరీరంలో యూరిక్ యాసిడ్ ను ఫిగ్స్‌ తగ్గించేస్తాయి.

ఎండు ద్రాక్ష..

ఎండు ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి స్ట్రెస్ ను తగ్గించేస్తాయి. వీటిని కూడా రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి. ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎండు ద్రాక్ష యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది.

అప్రికాట్స్‌..

విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేస్తుంది. రెగ్యులర్‌గా అప్రికాట్స్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాదు సమర్థవంతంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ఫిగ్స్‌ డ్రై రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories