Uric Acid : యూరిక్ యాసిడ్ పెరిగితే కనిపించే లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి?

Uric Acid : యూరిక్ యాసిడ్ పెరిగితే కనిపించే లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి?
x

Uric Acid : యూరిక్ యాసిడ్ పెరిగితే కనిపించే లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి?

Highlights

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో తయారయ్యే ఒక సహజ రసాయనం. ఇది ఆహారం జీర్ణం అయినప్పుడు, కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడుతుంది.

Uric Acid : యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో తయారయ్యే ఒక సహజ రసాయనం. ఇది ఆహారం జీర్ణం అయినప్పుడు, కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడుతుంది. సాధారణంగా, మూత్రపిండాలు దీనిని రక్తం నుంచి వడపోసి, మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే, మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేదా కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, అది శరీరంలో భయంకరమైన నొప్పిని, వాపును కలిగిస్తుంది. అదనపు యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే ముఖ్యమైన సమస్య గౌట్. ఈ సమస్య లక్షణాలు ఏమిటి, అసలు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది, దానిని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఆహారం జీర్ణం అయినప్పుడు, పాత కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే ఒక రసాయన పదార్థం. ఇది రక్తంలో కలిసి, మూత్రపిండాల ద్వారా మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది. మనం తినే ఆహారంలో ఎక్కువ ప్రొటీన్లు ఉండడం, మద్యపానం, ఊబకాయం, సరిగా లేని జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు. కొన్ని రకాల వ్యాధులు, మందులు కూడా దీని స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ కాలం పెరిగితే, అది శరీరంలో దీర్ఘకాలిక వాపు, కీళ్ల నొప్పులు, ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతుంది.

యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే అత్యంత సాధారణ సమస్య గౌట్. ఇది తీవ్రమైన నొప్పులు, వాపును కలిగిస్తుంది. గౌట్ వచ్చినప్పుడు కీళ్ళలో, ముఖ్యంగా కాలి బొటనవేలు, మోకాలు, చీలమండలంలో తీవ్రమైన నొప్పి, వాపు కనిపిస్తుంది. నొప్పి రాత్రిపూట మరింత ఎక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల మూత్రంలో ఇబ్బంది, నొప్పి, మంట లేదా తరచుగా మూత్రం వచ్చే సమస్యలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు దీర్ఘకాలం పెరిగి ఉంటే, అది గుండెపోటు, అధిక రక్తపోటు, తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీయవచ్చు.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ప్రారంభ లక్షణాలు తేలికగా ఉంటాయి. చాలా మంది వీటిని సాధారణ అలసట లేదా కీళ్ల నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కీళ్లలో, ముఖ్యంగా బొటనవేలు, మోకాలు, చీలమండలంలో అకస్మాత్తుగా నొప్పి, వాపు రావడం. కీళ్ల వద్ద ఎర్రగా మారడం, వేడిగా అనిపించడం, తీవ్రమైన కేసులలో రాత్రి సమయంలో నొప్పి అకస్మాత్తుగా తీవ్రమవుతుంది. కొందరిలో మూత్రంలో మంట లేదా తరచుగా మూత్ర విసర్జన, అలసట, కండరాల బలహీనత, అప్పుడప్పుడు జ్వరం కూడా ఉండవచ్చు.

యూరిక్ యాసిడ్ నియంత్రణకు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అధిక ప్రొటీన్ ఉండే ఆహారాన్ని, చక్కెర పానీయాలు, ఆల్కహాల్ సేవనాన్ని తగ్గించాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. ఇది యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం లేదా నడక చేయడం, ఆరోగ్యకరమైన ఆహారంతో బరువు తగ్గించుకోవడం మంచిది. యోగ, ధ్యానం వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. లక్షణాలు నిరంతరంగా కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మందులు, సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories