Carom Seeds : పీరియడ్స్ సమయంలో వాంతులు, కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే... వామును ఇలా వాడండి

Carom Seeds
x

Carom Seeds : పీరియడ్స్ సమయంలో వాంతులు, కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే... వామును ఇలా వాడండి

Highlights

Carom Seeds : ఓం కాలు లేదా అజ్వైన్ లేదా వాము అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ సుగంధభరితమైన మసాలా మనందరికీ సుపరిచితమే.

Carom Seeds : ఓం కాలు లేదా అజ్వైన్ లేదా వాము అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ సుగంధభరితమైన మసాలా మనందరికీ సుపరిచితమే. వంటకు మాత్రమే కాకుండా ఇందులో ఉన్న అనేక ఔషధ గుణాల కారణంగా ఇది ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా విరివిగా ఉపయోగించబడుతుంది. వామును తీసుకోవడం వలన జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు, ఇందులో నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మంచి కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే వాము నీరు తాగడం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

పీరియడ్స్ సమస్యలు, జీర్ణక్రియకు వాము

వాములో సమృద్ధిగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. వెచ్చని నీటిలో వాము పొడి మిశ్రమాన్ని కలిపి తాగడం వలన, పీరియడ్స్ సమయంలో మహిళలు అనుభవించే వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, ఈ వాము నీరు కడుపు ఉబ్బరం, గ్యాస్, సాధారణ జీర్ణ సమస్యలను తగ్గించడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో వాము పొడిని కలిపి తాగడం వలన జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి.

ఊపిరితిత్తుల సమస్యలు, బరువు తగ్గడంలో వాము పాత్ర

దగ్గు, జలుబు, కఫం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు రోజూ వాము నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు శ్వాస సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి వాము నీరు ఒక అద్భుతమైన మార్గం. వాము పొడిని కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి క్రమం తప్పకుండా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వాము పొడి అందుబాటులో లేని సందర్భంలో వాము గింజలను నేరుగా కూడా నమిలి తినవచ్చు.

దంత సమస్యలు, ఇతర ప్రయోజనాలు

వాము కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాకుండా, దంత సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. వాము గింజలను బాగా పొడి చేసి నిల్వ ఉంచుకోవాలి. దంత నొప్పి వచ్చినప్పుడు, అర టీస్పూన్ వాము పొడికి కొద్దిగా ఆలివ్ నూనె, గోరువెచ్చని నీరు కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో ఉంచుకోవడం వలన నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది నోటి దుర్వాసనను కూడా నివారిస్తుంది. ఈ విధంగా సులభంగా లభించే వాము అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన చిట్కాగా ఉపయోగపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories