Vitamin D: విటమిన్‌ 'డీ' ఎక్కువైతే ఈ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..!

Vitamin D: విటమిన్‌ డీ ఎక్కువైతే ఈ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..!
x
Highlights

Vitamin D: విటమిన్ డి శరీరంలో కాల్షియం తీసుకునే సామర్ధ్యాన్ని మెరుగుపరిచి ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.

Vitamin D: విటమిన్ డి శరీరంలో కాల్షియం తీసుకునే సామర్ధ్యాన్ని మెరుగుపరిచి ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ఇది రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్ల స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులను నివారించడంలో విటమిన్ డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వైరల్ , బ్యాక్టీరియల్ సంక్రమణలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. శరీరంలోని కండరాల బలాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి దీనిలో ఉంది. సూర్యకాంతి ద్వారా సహజంగా లభించే ఈ విటమిన్‌ను సమతుల్యంగా పొందడం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో అవసరం.

విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది?

విటమిన్ డి అవసరమైన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కానీ, ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కలగవచ్చు. అధికంగా తీసుకున్నప్పుడు ఇది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచి హైపర్‌కాల్సీమియా అనే సమస్యకు దారి తీస్తుంది. ఇది వికారం, వాంతులు, మూత్ర విసర్జనలో పెరుగుదల, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలను కలిగించవచ్చు. దీర్ఘకాలికంగా అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశముంది. అలాగే, ఎముకల బలహీనత ,గుండె సంబంధిత సమస్యలు కూడా రావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల, డాక్టర్ సలహా మేరకే విటమిన్ డి సప్లిమెంట్స్ వినియోగించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories