Rice : ఒక నెల రోజులు అన్నం తినడం మానేస్తే మీ శరీరంలో ఏమేమి జరుగుతాయో తెలుసా?

Rice : ఒక నెల రోజులు అన్నం తినడం మానేస్తే మీ శరీరంలో ఏమేమి జరుగుతాయో తెలుసా?
x

Rice : ఒక నెల రోజులు అన్నం తినడం మానేస్తే మీ శరీరంలో ఏమేమి జరుగుతాయో తెలుసా?

Highlights

మనలో చాలా మంది అన్నం తినకుండా ఒక్క రోజు కూడా గడపలేరు. మూడు పూటలా అన్నం పెట్టినా ఇష్టపడి తినేవారు చాలా మంది ఉన్నారు. ఎంత రుచికరమైన భోజనం ముందున్నా అన్నం లేనిదే భోజనం అసంపూర్ణమని భావిస్తారు.

Rice : మనలో చాలా మంది అన్నం తినకుండా ఒక్క రోజు కూడా గడపలేరు. మూడు పూటలా అన్నం పెట్టినా ఇష్టపడి తినేవారు చాలా మంది ఉన్నారు. ఎంత రుచికరమైన భోజనం ముందున్నా అన్నం లేనిదే భోజనం అసంపూర్ణమని భావిస్తారు. అయితే, ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా మంది అన్నం తినడం మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు ఒక్క పూట మాత్రమే అన్నం తింటారు, మరికొందరు అన్నాన్ని అసలు ముట్టుకోరు. అలా అన్నం మానేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందా, దీని వల్ల ప్రయోజనం ఉందా అనే సందేహం చాలా మందిని వేధిస్తుంది. ముఖ్యంగా ఒక నెల రోజులు అన్నం తినడం పూర్తిగా ఆపేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆకలి, చిరాకు: అన్నం మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన వనరులలో ఒకటి. మీరు అకస్మాత్తుగా అన్నం తినడం మానేస్తే, మీ శరీరం ఈ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొదటి కొన్ని రోజులలో ఆకలి పెరగడం, బలహీనత లేదా కొద్దిగా చిరాకు కలగవచ్చు. కాబట్టి, అన్నానికి బదులుగా రాగులు, బార్లీ, క్వినోవా లేదా గుమ్మడికాయ గింజలు వంటి ఇతర ధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

బరువు తగ్గడం: అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతుంది. మీరు అన్నం తినడం మానేస్తే మీ శరీరానికి అందే కేలరీలు తగ్గుతాయి. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినడం తగ్గించవచ్చు. ఇది శరీరానికి చాలా మంచిది.

రక్తంలో షుగర్ లెవల్ స్థిరంగా ఉంటుంది: తెల్ల బియ్యం త్వరగా జీర్ణమవుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్ వేగంగా పెంచడానికి కారణమవుతుంది. ఒక నెల రోజులు అన్నం తినడం మానేస్తే మీ రక్తంలో షుగర్ లెవల్ ని స్థిరంగా ఉంచుకోవచ్చు. డయాబెటిక్స్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో షుగర్ లెవల్ నియంత్రించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియలో మార్పులు: కొందరు అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలను అనుభవిస్తారు. అయితే అన్నం తినడం మానేస్తే మీకు మొదట్లో కొద్దిగా కడుపు నొప్పి లేదా మలబద్ధకం అనిపించవచ్చు. కానీ పండ్లు, కూరగాయలు, ధాన్యాలను ఎక్కువగా తింటే, మీ జీర్ణక్రియ త్వరగా మెరుగుపడుతుంది.

పోషకాహార లోపం వచ్చే ప్రమాదం: బియ్యంలో విటమిన్ B ఉంటుంది, ఇది శరీరం శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ కాలం అన్నం తినకపోతే, ఈ విటమిన్ లోపం ఏర్పడవచ్చు. ఇది అలసట, మానసిక స్థితిలో మార్పులకు దారితీయవచ్చు. మీరు కూడా అన్నం తినడం మానేస్తే, శరీరానికి అవసరమైన విటమిన్ B, ఇతర అవసరమైన పోషకాలను వేరే ఆహారం ద్వారా పొందవలసి ఉంటుంది. అంతేకాకుండా, మీరు తినే ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలువంటి ప్రత్యామ్నాయ ఆహారాలను చేర్చుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories