
Testosterone: 30 ఏళ్ల తర్వాత పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుంది? కారణాలివే
Testosterone: సాధారణంగా పురుషులలో 30 సంవత్సరాల వయస్సు తర్వాత టెస్టోస్టెరాన్ లెవల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియే అయినప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
Testosterone: సాధారణంగా పురుషులలో 30 సంవత్సరాల వయస్సు తర్వాత టెస్టోస్టెరాన్ లెవల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియే అయినప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఒకవేళ మీ టెస్టోస్టెరాన్ లెవల్స్ వేగంగా పడిపోతుంటే, దానికి ఏదైనా ఆరోగ్య సమస్య కారణం కావచ్చు. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడటం మొదలవుతాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎందుకు తగ్గుతాయి, దాని లక్షణాలు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
టెస్టోస్టెరాన్ కేవలం లైంగిక క్రియలకు మాత్రమే కాకుండా, శరీరంలో అనేక ఇతర ముఖ్యమైన పనులను కూడా చేస్తుంది. కండరాల పెరుగుదల, ఎముకల సాంద్రత, ఎనర్జీ లెవల్స్, మానసిక స్థితి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, టెస్టోస్టెరాన్ లోపం ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా లైంగిక క్రియలపైనే పడుతుంది.
వైద్యుల ప్రకారం.. 30 సంవత్సరాల వయస్సు తర్వాత దీని స్థాయి సహజంగా తగ్గడం మొదలవుతుంది. కొన్ని పరిస్థితులు, రోజువారీ అలవాట్లు, ఆహారపు అలవాట్లు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. చాలా సందర్భాలలో మానసిక ఒత్తిడి కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడానికి కారణం అవుతుంది. టెస్టోస్టెరాన్ లోపం ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో చూద్దాం.
లైంగిక కోరిక తగ్గడం, అలసట, కండరాల బలహీనత, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, జుట్టు రాలడం, చిరాకు, డిప్రెషన్ లేదా ఏకాగ్రత లోపం, నిద్రలేమి, వృషణాల పరిమాణంలో మార్పు వంటివి టెస్టోస్టెరాన్ తగ్గడానికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. 30 ఏళ్ల వయస్సు తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలైతే, వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
శరీరం టెస్టోస్టెరాన్ లెవల్ ని స్థిరంగా ఉంచడానికి కృషి చేస్తుంది. అయితే, ఒత్తిడి, మధుమేహం లేదా తప్పుడు చెడు అలవాట్ల వల్ల దాని స్థాయి తగ్గుతుంది. 50 సంవత్సరాల వయస్సు రాకముందే పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే, వెంటనే మీ దినచర్యలో మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు 7-9 గంటల నిద్ర చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా ఇతర రిలాక్సేషన్ పద్ధతులు పాటించాలి. పొగత్రాగడం, మద్యం సేవించడం మానేయాలి. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire