Avocado: ఎండాకాలం ప్రతిరోజు ఒక అవకాడో ఎందుకు తినాలో తెలుసుకోండి.. లేకుంటే ఈ లాభాలు మిస్సవుతారు..

Avocado
x

Avocado: ఎండాకాలం ప్రతిరోజు ఒక అవకాడో ఎందుకు తినాలో తెలుసుకోండి.. లేకుంటే ఈ లాభాలు మిస్సవుతారు..

Highlights

Avocado In Summer: అవకాడోలు మనదేశంలో ఖరీదు.. ఇందులో రకాలు కూడా ఉంటాయి. అయితే అవకాడోలో ఖనిజాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎండాకాలం ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం..

Avocado In Summer: పోషకాలు పుష్కలంగా ఉండే అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మన శరీరానికి మంచి పోషణ అందిస్తుంది. ఎండాకాలం అవకాడో డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం .

ఎలక్ట్రోలైట్..

ఎండాకాలం అవకాడో తీసుకోవడం వల్ల మంచి ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది. ఇది ఎంతటి వేడి వాతావరణంలో కూడా సహజమైన హైడ్రేషన్ మన శరీరానికి అందిస్తుంది. అవకాడోలో పొటాషియం ఉండటం వల్ల డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ..

అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు కలిగి ఉన్న అవకాడోలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ఎండ నుంచి కాపాడుతుంది. ఇందులో లూటీన్, గ్జియాంతీన్‌ హానికర సూర్యూని యూవీ కిరణాల నుంచి మన చర్మాన్ని సన్ డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుతుంది.

ఫైబర్ ..

ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఎండాకాలం ప్రతిరోజు ఒక అవకాడో తినాలి. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. దీంతో కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేసి కడుపులో గ్యాస్, అజీర్తి తగ్గిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది అవకాడో. దీంతో దీర్ఘకాలిక మలబద్ధక సమస్యలు కూడా రావు.

తక్షణ శక్తి ..

అవకాడో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. ప్రధానంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్‌ ఉంటుంది. ఇది కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో అతిగా తినం, బరువు పెరగం. రక్తంలో చక్కర స్థాయిలో అదుపులో ఉంచుతుంది. ఇందులో గ్లైసిమిక్ సూచీ (GI) కూడా తక్కువగా ఉంటుంది.

చర్మం, జుట్టు..

అవకాడో ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మం, జుట్టుకు కూడా మంచి పోషణ అందిస్తుంది. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి, బయోటిన్ ఉంటుంది, చర్మానికి సాగే గుణం అందించి ఈ ఎండాకాలం మంచి హైడ్ రేషన్ అందిస్తుంది. జుట్టు ఆరోగ్యంతోపాటు బలంగా పెరిగేలా తోడ్పడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories