Miscarriage : మహిళలారా… గర్భస్రావం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి

Miscarriage : మహిళలారా… గర్భస్రావం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి
x

Miscarriage : మహిళలారా… గర్భస్రావం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి

Highlights

గర్భం అనేది ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. స్త్రీకి మాత్రమే మరొక జీవికి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.

Miscarriage : గర్భం అనేది ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. స్త్రీకి మాత్రమే మరొక జీవికి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆమెను దైవ స్వరూపంగా భావిస్తారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గర్భం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే ఎన్నో విధాలుగా ప్రయత్నించాలి. ఇది అందరికీ సాధ్యం కాదు, కొన్నిసార్లు గర్భస్రావం జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా మనసును గట్టి చేసుకోవాలి. అంతేకాదు ఆరోగ్య నిపుణులు ఇక్కడ ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటించాలి. అంటే, సాధారణంగా గర్భస్రావం తర్వాత, మహిళలు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే అవి ఆరోగ్యాన్ని పాడుచేయగలవు. కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆరోగ్యకరమైన సలహాలను పాటించడం చాలా ముఖ్యం.

గర్భస్రావం అంటే ఏమిటి?

గర్భధారణ 20 వారాలలోపు గర్భంలోనే పిండం చనిపోతే దానిని గర్భస్రావం అంటారు. ఇటువంటి పరిస్థితి ఏ మహిళకు కూడా రాకూడదని కోరుకుంటారు. కానీ కొందరిలో ఈ సమస్యలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ పరిస్థితి నుండి చాలా త్వరగా కోలుకోవడానికి, తదుపరి గర్భధారణకు సహాయపడే విధంగా ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సలహాలను కచ్చితంగా పాటించాలి. గర్భస్రావం అనేక కారణాల వల్ల జరగవచ్చు. కొందరిలో జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, అనారోగ్యం లేదా శారీరక సమస్యలు వంటి వివిధ కారణాలు గర్భస్రావానికి దారితీసి ఉండవచ్చు.

మానసిక, శారీరక ప్రభావాలు

ఇంతేకాదు ఈ గర్భస్రావం మహిళకు మానసికంగా, శారీరకంగా చాలా అలసటను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది మీ కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. మరి గర్భస్రావం తర్వాత చేయకూడని పనులు ఏమిటి? ఎందుకు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం.

గర్భస్రావం తర్వాత చేయకూడని పనులు:

వైద్యుల సలహా లేకుండా మందులు వద్దు: గర్భస్రావం అయినప్పుడు కనిపించే మొదటి లక్షణం రక్తస్రావం. ఇది ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఇలాంటి సమయంలో మహిళలు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ సమయంలో ఇతరుల మాటలు వినకూడదు. అంతేకాదు, వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మాత్రలు, మందులు లేదా ఇతర ఔషధాలను సేవించకూడదు.

టాంపోన్‌లు ఉపయోగించవద్దు: గర్భస్రావం తర్వాత కొందరిలో ఎక్కువ కాలం రక్తస్రావం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో టాంపోన్‌లను ఉపయోగించకూడదు. వీలైనంత వరకు వీటిని ఉపయోగించకుండా ఉండండి. దీనికి బదులుగా సాధారణంగా ఉపయోగించే ప్యాడ్‌లను వాడండి.

లైంగిక సంభోగ దూరం పాటించండి: గర్భస్రావం తర్వాత, కొంతకాలం పాటు లైంగిక సంభోగం నుండి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఈ సమయంలో మహిళలు చాలా బలహీనంగా ఉంటారు. అంతేకాదు ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను నివారిస్తుంది. ఈ సమయంలో మహిళలు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతే లైంగిక కార్యకలాపాలను ప్రారంభించడం మంచిది.

భారీ వ్యాయామాలు వద్దు: గర్భస్రావం తర్వాత, మహిళలు ఈత వంటి ఎలాంటి భారీ వ్యాయామాలను చేయకూడదు. ఎందుకంటే గర్భస్రావం తర్వాత, శరీరం అంత సామర్థ్యాన్ని కలిగి ఉండదు.

ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి: గర్భిణికి ఆకస్మిక గర్భస్రావం జరిగితే, ఆ ప్రయాణం అంత సులభం కాదని గుర్తుంచుకోండి. గర్భస్రావం తర్వాత, మహిళ శరీరం సులభంగా కోలుకోదు. సరిగ్గా కోలుకోవడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. కాబట్టి దీని గురించి నిపుణులతో సంప్రదించడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories