Ajith: తెగింపు మూవీ రివ్యూ.. ఒక మంచి మెసేజ్ ఉన్న కథ..

Ajith Thegimpu Movie Review
x

Ajith: తెగింపు మూవీ రివ్యూ.. ఒక మంచి మెసేజ్ ఉన్న కథ..

Highlights

Ajith: తెగింపు మూవీ రివ్యూ.. ఒక మంచి మెసేజ్ ఉన్న కథ..

చిత్రం: తెగింపు

నటీనటులు: అజిత్, మంజు వారియర్, సముతిరఖని, పావని రెడ్డి, వీర, భగవతి పెరుమాళ్, అజయ్, ప్రేమ కుమార్ తదితరులు

సంగీతం: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: నిరావ్ షా

నిర్మాత: బోనీ కపూర్

దర్శకత్వం: హెచ్ వినోద్

బ్యానర్లు: బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పీ, జీ స్టూడియోస్

విడుదల తేది: 11/01/2023

తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. చాలా వరకు అజిత్ డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఇప్పుడు అజిత్ హీరోగా "తునివు" అనే సినిమా తెలుగులో "తెగింపు" అనే టైటిల్ తో విడుదలైంది. అజిత్ హీరోగా ఇంతకుముందు నటించిన "నేర్కొండ పార్వయ్" మరియు "వాలిమై" సినిమాలకి దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక సినిమా మొత్తం ఒక దోపిడీ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా జనవరి 11న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

ఒక రౌడీల గుంపు యువర్ బ్యాంక్ ని లూటీ చేయడానికి అని ఒక పక్కా ప్లాన్ వేసుకుని వెళుతుంది. కానీ అక్కడ డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) ను చూసి వారు భయపడతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ రౌడీల గుంపు ని, కస్టమర్లను, స్టాఫ్ నూ అందరినీ హోస్టేజస్ గా మార్చి డార్క్ డెవిల్ ప్రభుత్వంతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఇంతకీ ఈ డార్క్ డెవిల్ అసలు ఎవరు? బ్యాంకులో ఎందుకు ఉన్నాడు? అతనికి ఏం కావాలి? ఎవరికోసం బ్యాంక్ దోపిడీ చేయాలని అనుకుంటున్నాడు? చివరికి ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

అజిత్ అద్భుతమైన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అజిత్ అందరి దృష్టిని చాలా బాగా ఆకట్టుకున్నారు. తన పాత్రలో పూర్తిస్థాయిలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. మంజు వారియర్ కూడా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. సముతిరఖని నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించేది కాసేపై అయినప్పటికీ సముతిరఖని చాలా బాగా నటించారు. అజయ్ కు కూడా చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఒక మంచి పాత్ర దక్కింది తన పాత్ర పరిధి మేరకు అజయ్ కూడా బాగానే నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా అంతా పబ్లిక్ ఫండ్స్ ను ప్రభుత్వం ఎలా మిస్ యూస్ చేస్తుంది అనే కాన్సెప్ట్ పై నడుస్తుంది. ఈ సినిమా నుంచి డైరెక్టర్ మంచి సోషల్ మెసేజ్ కూడా ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ సినిమా నేరేషన్ మాత్రం ఏమాత్రం బాగాలేదు. చాలావరకు సన్నివేశాలు అసలు కథలో ఏమవుతుంది అని ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ వచ్చేలాగా చేస్తాయి. స్క్రీన్ ప్లే కొంచెం టైట్ గా ఉండి ఉంటే బాగుండేది. జిబ్రాన్ అందించిన సంగీతం పరవాలేదు అనిపిస్తుంది. పెద్ద చెప్పుకోదగ్గ పాటలు కూడా ఏమీ లేదు. సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి మంచి బ్రైట్ విజువల్స్ ను అందించారు. రన్ టైం కొంచెం తగ్గించి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే అనిపిస్తుంది.

బలాలు:

అజిత్

సోషల్ మెసేజ్

రిలేటబుల్ కథ

బలహీనతలు:

నేరేషన్

ఫస్ట్ హాఫ్

డైరెక్షన్

హై మూమెంట్స్ లేకపోవడం

చివరి మాట:

అక్కడక్కడ సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగానే అలరిస్తాయి. ముఖ్యంగా గుండాలకి మరియు అజిత్ కి మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. కథ బోర్ కొడుతుంది అనుకున్న సమయంలో ఇలాంటి కామెడీ సీన్స్ ప్రేక్షకులకు మంచి బూస్ట్ ఇస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా అజిత్ నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఈ సినిమాకి పెద్ద హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను చాలా బాగా మెప్పిస్తుంది. కొన్ని కొన్నిచోట్ల ఒక సీన్ నుంచి మరొక సీన్ కి ఎందుకు వెళుతుందో అర్థం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ చాలా వరకు స్క్రీన్ ప్లే చాలా స్లోగా బోరింగ్ గా ఉంటుంది. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా "తెగింపు" ఒకసారి చూడదగ్గ మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా.

బాటమ్ లైన్:

"తెగింపు" సరైన ఎక్జిక్యూషన్ లేని ఒక మంచి మెసేజ్ ఉన్న కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories