Anaganaga Australia Lo Movie Review: హాలీ వుడ్ స్థాయిలో అనగనగా ఆస్ట్రేలియాలో.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న థ్రిల్లర్

Anaganaga Australia Lo Movie Review:  హాలీ వుడ్ స్థాయిలో అనగనగా ఆస్ట్రేలియాలో.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న థ్రిల్లర్
x
Highlights

Anaganaga Australia Lo Movie Review: చిత్రం: ఆనగణగా ఆస్ట్రేలియాలోకథ:హీరో (ఒక క్యాబ్ డ్రైవర్) సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మరోవైపు హీరోయిన్ తన...

Anaganaga Australia Lo Movie Review: చిత్రం: ఆనగణగా ఆస్ట్రేలియాలో

కథ:

హీరో (ఒక క్యాబ్ డ్రైవర్) సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మరోవైపు హీరోయిన్ తన చదువుకోసం చిన్న చిన్న అసైన్‌మెంట్స్ రాసి డబ్బులు సంపాదిస్తూ తన ఫీజులు కడుతుంది.

ఇదే సమయంలో ఒక రాజకీయ నేత తన కొడుకుని పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని చూస్తాడు. కానీ ఒక రహస్యం కారణంగా అది సాధ్యం కాదు. అదే రహస్యాన్ని వెతికి తెచ్చేందుకు ఒక క్రిమినల్‌ని హైర్ చేస్తారు.

ఓ రోజు, హీరోయిన్ తన అసైన్‌మెంట్ డబ్బులు తీసుకోవడానికి ఓ వ్యక్తి రూమ్‌కి వెళ్తుంది. అయితే పొరపాటున ఓ క్రిమినల్ రూమ్‌లోకి వెళ్లి, అక్కడ చిన్నగా కొన్నీ సామాను దొంగిలిస్తుంది. అసలు విషయం ఏంటంటే.. ఆ రూమ్‌లోనే పెద్ద స్కామ్ నడుస్తోంది. తెలియకుండానే ఆమె ఆ క్రిమినల్ కేసులో ఇరుక్కుంటుంది.

ఫస్ట్ హాఫ్ హైలైట్స్:

కామెడీ ట్రాక్: ఆ రహస్యాన్ని వెతికే ఇద్దరు వ్యక్తుల మధ్య కామెడీ హైలైట్.

థ్రిల్ ఎలిమెంట్స్: హీరోయిన్ ఎలా చిక్కుకుందో సస్పెన్స్.

హీరో ఎంట్రీ: హీరోయిన్ తన ప్రాణాల కోసం పరుగు తీయగా, అనుకోకుండా హీరోని కలుస్తుంది.

సెకండ్ హాఫ్:

హీరో తన ఊరి అభివృద్ధి కోసం మంచిపనులు చేస్తూ స్కూల్ కట్టాలని డబ్బు కోసం ప్రయత్నిస్తుంటాడు. హీరోయిన్ దగ్గర పెద్ద మొత్తం ఉన్నా, అది ప్రమాదకరమైన డబ్బు కావడంతో, రిస్క్ తీసుకోవాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్. చివరికి "ఇది దొంగ డబ్బే కదా, మంచిపనికి ఉపయోగిద్దాం" అనుకుని ప్లాన్ మొదలుపెడతారు.

ఈ క్రమంలోనే హీరో కూడా స్కామ్‌లో ఇరుక్కుంటాడు. పరిస్థితులు చేజారిపోతాయి. చివరికి డబ్బు తీసుకుని దేశం విడిచి వెళ్లాలని అనుకుంటారు, కానీ అసలు షాక్ అప్పుడే ఎదురవుతుంది – డబ్బు ఎవరో ఎత్తుకెళ్లిపోతారు!

క్లైమాక్స్:

క్లైమాక్స్‌లో అసలు సీక్రెట్ బయటికొస్తుంది. హీరోయిన్ దొంగిలించిన వస్తువుల్లో ఉన్న మెమొరీ కార్డ్‌లో పెద్ద స్కామ్ వీడియో ఉంటుంది – ఆ పొలిటిషన్ కొడుకు నిజంగా ఎవరో తెలుసుకుని, దాన్ని బ్రోకర్‌కి అమ్మి డబ్బు తీసుకుంటారు. కానీ చివరికి ఆ డబ్బు కూడా స్కామ్ అవుతుంది. మన హీరో, హీరోయిన్ చేతిలో ఏమీ మిగలదు.

కానీ... హీరో ప్లాన్ చెసి చివరికి డబ్బు తిరిగి తెచ్చుకుంటాడు. ఇలా స్టోరీ ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది.

విశ్లేషణ:

ఈ సినిమా పూర్తి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. కామెడీ, రొమాన్స్, స్కామ్ బ్యాక్‌డ్రాప్ – అన్నీ బ్యాలెన్స్ చేస్తూ కథ సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్, స్క్రీన్‌ప్లే, నటన – అన్ని ప్రధానమైన బలాలుగా నిలుస్తాయి.

ప్లస్ పాయింట్స్:

కథలో థ్రిల్లింగ్ టచ్
 కామెడీ ఎలిమెంట్స్
 హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ
 సస్పెన్స్‌ఫుల్ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

కొన్ని సీన్స్ మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది
 లాజిక్ లోపాలు కొంతవరకు కనబడుతాయి

చివరిగా:

మంచి స్కామ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. కామెడీ, థ్రిల్, రొమాన్స్ కలిపిన ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఇది. మీరు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కాస్త వినోదాన్ని ఆస్వాదించాలని అనుకుంటే, ఈ సినిమా ఓ మంచి ఆప్షన్.

రేటింగ్: 2.75 /5

Show Full Article
Print Article
Next Story
More Stories