Baby Movie Review: పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ

Baby Movie Review: ఆనంద్ దేవరకొండ ప్రయోగాలతో దూసుకెలుతున్నాడు.

Arun Chilukuri
Published on: 14 July 2023 3:59 PM IST
Baby Movie Review in Telugu
X

Baby Movie Review: పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ

Baby Movie Review: ఆనంద్ దేవరకొండ ప్రయోగాలతో దూసుకెలుతున్నాడు. ఇప్పడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీతో దండెత్తాడు. ఓ పెద్ద హీరో మూవీ రేంజ్ లో జనం ఈ సినిమా రిలీజ్ కోసం వేయిట్ చేసేలా చేసింది ప్రోమో. మరి రిలీజ్ అయ్యాక, టాక్ కిక్ ఇచ్చిందా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ కాంబినేషణ్ లో సాయి రాజేష్ తెరకెక్కించిన ముక్కోణపు ప్రేమకథ బేబీ. ప్రజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రివ్యూకే మంచి టాక్ రావటంతో ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చినట్టు తెలుస్తోంది.

స్కూల్ ఏజ్ నుంచే హీరోని ప్రేమించే హీరోయిన్, హీరో టెంథ్ ఫేలై ఆటో డ్రైవర్ గా మారటం, తను మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలో చేరటం జరిగిపోతుంది. ఇక కాలేజ్ లో తోటి విధ్యార్దితో ప్రేమలో పడ్డ హీరోయిన్, అలానే తన చైల్డ్ హుడ్ ప్రేమ ఈ రెండీటి మధ్య నలిగిపోతుంది. చివరకి ఎవరి ప్రేమ గెలుస్తుందన్న పాయింట్ తో తెరకెక్కింది ఈ మూవీ.

ఆటో డ్రైవర్ పాత్రలో ఆనంద్ తన పెర్పామెన్స్ తో ఆకట్టుకున్నాడు. వైష్ణవి, విరాజ్ కూడా పాత్రల్లో పాతుకుపోయారు. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం కలిసొచ్చింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయనే టాకే వస్తోంది.

ఇక బేబీ మూవీ విషయంలో సాయి రాజేష్ నెరేషన్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. పాత్రల పరిచయం, బావోధ్వేగాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ అదిరింది. క్లైమాక్స్ లో నటుల పెర్ఫామెన్స్ మీద మిక్స్ డ్ టాక్ వచ్చినా, ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ టాకే పెరిగింది.

ట్రాయాంగిల్ లవ్ స్టోరీలో విరాజ్ పాత్ర విలన్ గా, హీరోయిన్ పాత్ర కొన్ని సార్లు గోడమీద పిల్లిలా ఉండటంతో, ఈ తరానికి కథ కనెక్ట్ అయ్యేలా ఉందంటున్నారు. ముక్కోణపు ప్రేమకథల్లో ఇది ప్రత్యేకం అనిపించేలా కథాంశం ఉండటం కలిసొచ్చే అంశం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story