Custody Movie Review: ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషెంట్ డైడ్.. హిట్టు కస్టమే..?

Custody Movie Review in Telugu
x

Custody Movie Review: ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషెంట్ డైడ్.. హిట్టు కస్టమే..?

Highlights

Custody Movie Review: ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషెంట్ డైడ్.. హిట్టు కస్టమే..?

టైటిల్‌: కస్టడీ

నటీనటుటు: నాగచైతన్య, అరవింద స్వామి, శరత్‌కుమార్‌, కృతీశెట్టి, ప్రియమణి, రామ్‌కీ, సంపత్‌ రాజ్‌ తదితరులు

నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

రచన- దర్శకుడు: వెంకట్‌ ప్రభు

సంగీతం: ఇళయరాజా,యువన్‌ శంకర్‌ రాజా

సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కథిర్

ఎడిటర్‌: వెంకట్ రాజేన్

విడుదల తేది: మే 12, 2023

Custody Movie Review: అక్కినేని కుటుంబం మూడో తరం నటవారసుడు నాగచైతన్య, గ్లామర్ డాల్ కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ మూవీ బాక్సాఫీస్ ముందుకొచ్చేసింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో సినిమా కూడా అదే స్థాయిలో హిట్ గ్యారెంటీ అని అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి, వరుస ఫ్లాపులతో డీలా పడిన అక్కినేని హీరోలకు రిలీఫ్ ఇస్తూ కస్టడీ సినిమా బాక్సాఫీసులను మెప్పించే విధంగా ఉందా..బాక్సాఫీసుల్ని నాగచైతన్య తన కస్టడీలోకి తీసుకున్నాడా..ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

నాగచైతన్య ఒక సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీని చాలా నిక్కచ్చిగా చేస్తాడు..అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే..ఉద్యోగాన్ని దైవంగా భావించి విధులు నిర్వహించే నాగచైతన్య...ఓ వైపు తన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు హీరోయిన్ కృతిశెట్టి ప్రేమలో పడతాడు. ఇరువురి కులాలు వేరైనా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య గట్టిగా ఫిక్స్ చేసుకుంటాడు. ఇక ఇదే టైంలో అరవింద్ స్వామిని అరెస్ట్ చేసి నాగచైతన్య స్టేషన్ కు తీసుకొస్తాడు. అయితే అరవింద్ స్వామిని చంపేందుకు ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ట్రై చేస్తుంది. అలాగే రౌడీలు కూడా అరవింద్ స్వామిని హత్య చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే నాగచైతన్య మాత్రం అరవింద్ స్వామిని చట్టం ముందు నిలబెట్టి శిక్షపడేలా చేయాలనుకుంటాడు. మరి, ఈ అరవింద్ స్వామి ఎవరు..అతన్ని అందరూ ఎందుకు చంపాలనుకుంటున్నారు. ఇందులో ప్రియమణి ఇన్వాల్వ్ మెంట్ ఏంటి..నాగచైతన్య తాను అనుకున్న విధంగా అరవింద్ స్వామిని చట్టం ముందు నిలబెట్టాడా..కృతి శేట్టిని వివాహం చేసుకున్నాడా..ఇదే టూకీగా కస్టడీ చిత్ర కథ..

కథ విషయానికొస్తే కస్టడీ పాయింట్ మన సిల్వర్ స్క్రీన్ కు చాలా ఫ్రెష్ అనే చెప్పాలి. సాధారణంగా విలన్ ను హీరో చంపాలి...కానీ ఇక్కడ మాత్రం విలన్ ను హీరో రక్షిస్తుంటాడు. ఈ కొత్త పాయింట్ కి తోడు దర్శకుడు రొటీన్ రెగ్యులర్ డ్రామాలా కాకుండా సినిమాని స్క్రీన్ ప్లే బేస్డ్ డ్రామాగా నడిపించాడు. మొదట్లో కాస్త నీరసంగా అనిపించినా..అరవింద్ స్వామి ఎంట్రీతో సినిమా పరుగు అందుకుంటుంది.

ఇక నటీనటుల పర్ ఫార్మెన్స్ విషయానికొస్తే, శివ పాత్రలో నాగచైతన్య యాక్టింగ్ చాలా బాగుంది. పర్ ఫార్మెన్స్ పరంగా చైతు మరో మెట్టు ఎక్కాడు. కృతిశెట్టి ఉన్నంతలో బాగా చేసింది. సినిమాకి నాగచైతన్య తర్వాత మరో హైలైట్ అరవింద్ స్వామి. రాజు పాత్రలో అరవింద్ స్వామి మరోసారి సెటిల్డ్ ఫర్ ఫార్మెన్స్ కనబరిచాడు. సీపీగా శరత్ కుమార్, ముఖ్యమంత్రిగా ప్రియమణి పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. ఇతర పాత్రలు కూడా ఓకే.

టెక్నికల్ పరంగా చూస్తే యువన్ శంకర్ రాజా, ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎస్ ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ఇక దర్శకుడిగా వెంకట్ ప్రభు ఫస్టాఫ్ ను బాగా డీల్ చేశాడు. సెకండ్ హాఫ్ ను కూడా అంతే స్థాయిలో రేసీగా అందించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా, సినిమాలో కొన్ని పాయింట్స్ బాగున్నా..పూర్తిస్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అక్కినేని నాగచైతన్య హిట్టు కోసం మరికొంత కాలం వెయిట్ చేయకతప్పదు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Show Full Article
Print Article
Next Story
More Stories