Erra Cheera Movie Review: 'ఎర్రచీర' రివ్యూ: హారర్ అరిపించింది..!

Erra Cheera Movie Review: సాధారణంగా హారర్ సినిమాలు అంటే చీకటి గదులు, వింత శబ్దాలు, ప్రతీకారాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, వీటన్నింటికీ 'మదర్...
Erra Cheera Movie Review: సాధారణంగా హారర్ సినిమాలు అంటే చీకటి గదులు, వింత శబ్దాలు, ప్రతీకారాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, వీటన్నింటికీ 'మదర్ సెంటిమెంట్' అనే బలమైన ఎమోషన్‌ను జోడించి, యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విభిన్న చిత్రం 'ఎర్రచీర'. నటుడు సుమన్ బాబు దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిందో చూద్దాం.
కథ:
ఈ సినిమా కేవలం ఊహల నుంచి పుట్టింది కాదు.. హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. ఆస్తి కాంక్షతో కన్నవారిని, కట్టుకున్నవారిని కడతేర్చే నేటి సమాజంలోని క్రూరత్వానికి.. మరణం తర్వాత కూడా తన బిడ్డను రక్షించుకోవాలనుకునే ఒక తల్లి ఆత్మకు మధ్య జరిగే పోరాటమే ఈ కథ. ఒక చిన్నారి (బేబీ సాయి తేజస్విని) చుట్టూ అల్లుకున్న సస్పెన్స్, క్షుద్ర శక్తుల ప్రభావం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి.
పెర్ఫార్మెన్స్ :
బేబీ సాయి తేజస్విని: నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారి మనవరాలిగా ఆమె తన నట వారసత్వాన్ని అద్భుతంగా చాటింది. సినిమాకు అసలైన వెన్నెముక ఈ చిన్నారి. హారర్ సీన్స్‌లో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి.సుమన్ బాబు దర్శకుడిగా, హీరోగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ బ్లాక్స్‌లో ఆయన పనితీరు చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.కారుణ్య చౌదరి కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న 'అవంతిక' పాత్రలో కారుణ్య ఒదిగిపోయింది. శ్రీరామ్, అజయ్, అయ్యప్ప పి. శర్మ, రఘుబాబు వంటి దాదాపు 23 మంది సీనియర్ నటులు ఉండటం సినిమాకు భారీతనాన్ని తెచ్చింది.
సాంకేతిక విలువలు:
దర్శకత్వ ప్రతిభ: ఒక సీరియస్ హారర్ సబ్జెక్టుకు ఎమోషన్‌ను జోడించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. బాబాల ముసుగులో జరిగే అరాచకాలు, క్షుద్ర పూజల వెనుక ఉన్న నిజాన్ని చూపించిన తీరు బాగుంది.
VFX & మ్యూజిక్:
చిన్న సినిమా అయినా గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దేవతలకు, క్షుద్ర శక్తులకు మధ్య జరిగే పోరాట దృశ్యాలు విజువల్ ట్రీట్‌గా ఉన్నాయి. ప్రమోద్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ప్రమోషన్స్‌లో హైలైట్ అయిన '36 ముద్దుల పాట' కేవలం యూత్ కోసమే కాకుండా, కథా గమనంలో భాగంగానే రావడం విశేషం.
ప్లస్ పాయింట్స్:
కథలో 20% వాస్తవ సంఘటనలు ఉండటం వల్ల ఆడియన్స్ కథకు త్వరగా కనెక్ట్ అవుతారు.
ఇంటర్వెల్ వద్ద వచ్చే మలుపు, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయి.
సినిమా ముగింపులో అరకు నేపథ్యంలో రానున్న 'ఎర్రచీర-2 (అంబిక)' గురించి ఇచ్చిన హింట్ క్యూరియాసిటీని పెంచింది.
హారర్ జోనర్‌లో తల్లి ప్రేమను ఎలివేట్ చేయడం ఒక కొత్త ప్రయోగం.
ఫైనల్‌గా :
'ఎర్రచీర' కేవలం భయపెట్టే సినిమా మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరినీ కదిలించే ఒక భావోద్వేగ ప్రయాణం. హారర్ థ్రిల్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా బేబీ సాయి తేజస్విని నటన కోసం ఈ సినిమాను ఒకసారి తప్పక చూడొచ్చు.
బాటమ్ లైన్: ఎర్రచీర.. భయం వెనుక దాగున్న ప్రేమ జ్వాల.
రేటింగ్: 2.75 / 5

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



