Pakka Commercial Review: 'పక్కా కమర్షియల్‌'మూవీ రివ్యూ.. అన్ని కమర్షియల్ హంగులు ఉన్న..

Gopichand Pakka Commercial Movie Review
x

Pakka Commercial Review: ‘పక్కా కమర్షియల్‌’మూవీ రివ్యూ..

Highlights

వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

చిత్రం: పక్కా కమర్షియల్

నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్, తదితరులు

సంగీతం: జేక్స్ బిజాయ్

సినిమాటోగ్రఫీ: కరం చావ్లా

నిర్మాత: బన్నీ వాసు

దర్శకత్వం: మారుతి

బ్యానర్: యూవీ క్రియేషన్స్, జీ ఏ 2 పిక్చర్స్

విడుదల తేది: 01/07/2022

వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక కోర్టు రూమ్ డ్రామా గా తెరకెక్కింది. ఇక టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా కమర్షియల్ ఎలెమెంట్లు అన్నీ ఉంటాయని దర్శక నిర్మాతలు ఇప్పటికే చెప్పుకొచ్చారు. టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులను అలరించే విధంగానే ఉండడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా ఇవాళ అనగా జూలై 1, 2022 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

జడ్జ్ (సత్యరాజ్) ఒక సూసైడ్ కేసులో తాను ఇచ్చిన తీర్పు గురించి బాధపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే జడ్జిగా తన ఉద్యోగం కూడా మానేస్తాడు. కానీ అతని కొడుకు గోపీచంద్ నీతి నిజాయితీ లేని ఒక లాయర్ లాగా మారతాడు. పక్కా కమర్షియల్ మనిషిలా మారిపోయిన తన కొడుకుకి తన తండ్రి ఎవరి వల్ల అయితే ఉద్యోగాన్ని మానేశారో అతని తరపు వాదించాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? ఈ కేసు వల్ల తండ్రి కొడుకుల మధ్య బంధం ఎలా మారింది? చివరికి కథ ఏమైంది అనేది థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటులు:

గోపీచంద్ నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించారు. డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ కూడా గోపీచంద్ కి చాలా బాగా సెట్ అయ్యాయి. ఇక నటన విషయంలో కూడా గోపీచంద్ కి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్స్ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. రాశిఖన్నా కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఫస్ట్ హాఫ్ లో రాశి ఖన్నా పాత్ర బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆమె పాత్ర అంతగా కనిపించలేదు. అయినాప్పటికీ తన పాత్ర పరిధి మేరకు రాశి ఖన్నా చాలా బాగా నటించింది. సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అనసూయ భరద్వాజ్, రావు రమేష్ కూడా తమ నటనతో బాగానే మెప్పించారు. అజయ్ ఘోష్ నటన కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

చాలా కాలం తర్వాత మారుతి తన మార్క్ కామెడీతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ సినిమా బాగానే మొదలైనప్పటికీ నేరేషన్ తో ప్రేక్షకులను మారుతీ కట్టిపడేయ్యలేకపోయారని చెప్పుకోవచ్చు. కథలో ఏమాత్రం కొత్త దనం లేకపోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఒక రైటర్ గా మారుతీకి మంచి మార్కులు వేయవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో మారుతీ పెద్దగా మెప్పించలేకపోయారు. సినిమాకి నిర్మాణ విలువలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. జేక్స్ బిజాయ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ని అందించారు. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ చాలా బాగుంది. కానీ మిగతా పాటలు అంతగా మెప్పించలేకపోయాయి. ఇక నేపథ్య సంగీతం విషయంలో పర్వాలేదు అనిపించాడు జేక్స్. కరం చావ్లా అందించిన విజువల్స్ బాగున్నాయి.

బలాలు:

ఎంటర్టైన్మెంట్

నటీనటులు

బలహీనతలు:

రొటీన్ స్టోరీ

కొన్ని కామెడీ సన్నివేశాలు

సెకండ్ హాఫ్

చివరి మాట:

సినిమా చాలా బాగా మొదలవుతుంది. చాలా వరకు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో గడిచిపోతుంది. ఇంటర్వెల్ నుంచి కథ మొత్తం మారిపోయినట్లు అనిపిస్తుంది. చాలావరకు సన్నివేశాలు చాలా ప్రేడిక్టబుల్ గా అనిపిస్తాయి. రోటీన్ సినిమా కథలాగా అనిపిస్తుంది. తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ ప్రేక్షకుల మీద అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ డోస్ కూడా చాలా తగ్గిపోతుంది. ఎమోషనల్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ అందులో ఏది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలాగా ఉండవు. ఎమోషనల్ సన్నివేశాలను చాలా వీక్ గా రాసుకున్నారు మారుతి. చివరిగా "పక్కా కమర్షియల్" ఒక రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్:

"పక్కా కమర్షియల్" అన్ని కమర్షియల్ హంగులు ఉన్న ఒక రొటీన్ స్టోరీ.

Show Full Article
Print Article
Next Story
More Stories