Sulthan Movie Review: 'సుల్తాన్‌' మూవీ రివ్యూ

Karthi Sulthan Telugu Movie Review
x

సుల్తాన్ సినిమాలో కార్తీ, రష్మిక

Highlights

Sulthan Movie Review: హీరో కార్తీకి టాలీవుడ్‌లో మార్కెట్ బాగానే ఉంది. కార్తీ గత చిత్రం ‘ఖైదీ’ మంచి విజయాన్ని సాధించింది.

Sulthan Movie Review: హీరో కార్తీకి టాలీవుడ్‌లో మార్కెట్ బాగానే ఉంది. కార్తీ గత చిత్రం 'ఖైదీ' తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన 'సుల్తాన్‌'గా వచ్చాడు. ర‌ష్మిక మందాన్న పల్లెటూరి పిల్లగా నటించింది‌. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జోనర్ లో రూపోందించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. సుల్లాన్ టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలను పెరిగాయి. మరి ఆ అంచనాలను కార్తీ అందుకున్నాడా? కార్తీ, రష్మికా మందాన్న జోడీ ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం..

కథ

ముంబైలోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు విక్రమ్ సుల్తాన్(కార్తీ)‌. ఆయన తండ్రి సేతుపతి(నెపోలియన్‌) ఓ డాన్‌. ఆయన దగ్గర 100మంది రౌడీలు ఉంటారు. వీరిని కౌరవులుగా పిలుస్తుంటారు. రౌడీయిజం అంటేనే నచ్చదు సుల్తాన్ కి. కానీ, అనుకోని సంఘటన వల్ల సుల్తాన్ 100 మంది రౌడీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇంతలో రుఖ్మిణి(రష్మికా మందన్నా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ, రుక్మిణి ఉన్న గ్రామానికి ఓ సమస్య ఉందని తెలుసుకొని, పరిష్కరిస్తాడు. అసలు ఆ సమస్య ఏంటి? రౌడీల బాధ్యతను సుల్తాన్‌ ఎందుకు తీసుకున్నాడు? తెలియాలంటే సుల్తాన్ సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

కార్తీ ప్రతీ సినిమాలో విలక్షణ పాత్రలే ఎంచుకుంటాడు. ఈ సినిమాలోనూ ప్రయోగాత్మక కథనే ఎంచుకున్నాడు. సుల్తాన్ పాత్రలో జీవించాడు. అలాగే బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఫైట్స్ లో అద్భుతంగా నటించాడు. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న ఆకట్టుకుంటుంది. ఓ కొత్త పాత్రలో కన్నడ బ్యూటీని చూడొచ్చు. హీరో తండ్రి పాత్రలో నెపోలియ‌న్ అలరిస్తాడు. విలన్ పాత్రలో 'కేజీఎఫ్‌' ఫేమ్ రామ్ నటన బాగుంది. అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా అలరిస్తాడు. వందమంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథే సుల్తాన్ సినిమా. కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నా.. తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్ సక్సెస్ కాలేదని తెలుస్తోంది.

ఫస్టాఫ్‌ మొత్తం నవ్వులతో ముంచేస్తాడు డైరెక్టర్. మెయిన్ స్టోరీని సెకండాఫ్‌లో చూపించాడు. అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండటం ఆడియోన్స్ కి కొంత ఇబ్బందిలా మారింది. 'కేజీఎఫ్‌' ఫేమ్‌ రామ్‌ లాంటి స్టార్‌ విలన్‌ పాత్రని బలంగా చూపించలేదు. కొన్ని యాక్షన్‌ సీన్స్ లో లాజిక్‌ మిస్‌ చేశాడు. కార్తీ, రష్మిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ మాత్రం ఆకట్టుకుంటాయి. సినిమాకు అవే బలంగా మారాయి. తెరపై వీరి జోడి బాగా కుదురింది. వివేక్ – మెర్విన్‌ల పాటలు, యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటర్‌ రూబెన్‌ కత్తెరకు మరికాస్త పని చెప్పాల్సింది.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే!

Show Full Article
Print Article
Next Story
More Stories